"జీవితమే........ఒక ఆట.......ఆడేసెయ్.....ఒక ఆట"
జీవితమే ఒక ఆట.....సాహసమే పూబాట......అన్నాడొక రచయిత. ఆట అని అన్నాడు సరే ఏ ఆట??....ఆ రచయిత ఏ ఆటను దృష్టిలో పెట్టుకొని రాసాడో మరి??.........ఫుట్ బాలా??......వాలీబాలా??.... ...త్రో బాలా??......బాస్కెట్ బాలా??......లేక కబడ్డినా??.........ఖోఖోనా? ?.......చదరంగమా??.......క్ యారమ్సా??....హైజంపా??..... ..లాంగ్ జంపా??.......రన్నింగ్ రేసా??.......మారధాన్ పరుగా.........లేక మన జాతీయ క్రీడైన హాకినా......లేకపోతే మన నరనరాల్లో జీర్ణించుకు పోయిన కర్రా ..బంతాటనా??......అదే...... కర్రబంతాటంటే క్రికెట్టేనండి.....నా మటుకు నేను జీవితాన్ని క్రికెట్ ఆటతోనే పోల్చుకుంటా ...........
క్రికెట్ ఆటలోని పార్మాట్లలో టెస్ట్, వన్ డే, T20, మ్యాచ్ లో ఏ ఫార్మాట్ అయినా కానీ ప్రతీ బ్యాట్స్ మన్ సెంచరీ కొట్టాలనే వస్తాడు. అలాగే నిజజీవితంలో మానవుడు కూడా వందేళ్ళు బ్రతికి సెంచరీ కొట్టడమే కాకుండా జీవితాన్ని సాఫీగా సాగదీయాలని అనుకుంటాడు. చెప్పాగా మన జీవితం క్రికెట్ లాంటిదని.....ఆడదామని బాగానే వస్తాం......కానీ అప్పుడప్పుడు యార్కర్ లాంటి ప్రమాదపూరిత కష్టాలూ వస్తాయి.......ఆ యార్కర్ బంతిని ఎదుర్కొనకపోతే క్రికెట్ లో అయితే వికెట్ ను, మన జీవితం లో ఐతే కాన్ఫిడెన్సుని కోల్పోవాల్సి వస్తుంది.....అలాగే బౌలర్ దేవుడికి కొంచెం కోపం వస్తే మాత్రం ఆ కసినంతా కూడగట్టుకుని మొఖం పైకి ఫుల్ టాస్ వేస్తాడు.....ఆ ఫుల్ టాస్ ని చాకచక్యంగా ఎదుర్కోకుండా డీలాగా ఉన్నామనుకో , హెల్మెట్ ఉన్నా సరే మొఖం పచ్చడవొచ్చు....యార్కర్లు.. ...ఫుల్ టాస్ ల లాంటి అతి కష్టాల వరకు ఓకే కానీ .....మరి సాధారణ బంతుల లాంటి కష్టాల సంగతి మరి??.......ఈ సాధారణ కష్టాలైనా అతి కష్టాలైనా ఎదుర్కోవాలంటే నిబ్బరం, సహనం ఉంటె సరిపోతుంది...అప్పుడప్పుడు చెత్త బంతులు వస్తే వాటిని ఎలా సిక్సర్ , ఫోర్ గా మలుస్తామో జీవితం లో కూడా మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి.....వాటిని పట్టుకోవాలి...... ఫీల్డర్ గా ఉంటే అప్పుడప్పుడు క్యాచ్ లు కూడా వస్తుంటాయి...క్యాచ్ లు అనేవి అవకాశాల లాంటివి.....క్యాచ్ మిస్ ఐతే ఒక్కొక్కసారి మ్యాచ్ మిస్ అవ్వొచు....ఒక్క క్యాచ్ మన పరిస్థితిని దిగజార్చుతుంది/ పెంచుతుంది....ఒక్కసారి క్యాచ్ మిస్ చేస్తే మళ్ళి మనకు బాల్ ఎప్పుడు వస్తుందా క్యాచ్ పట్టి మన టాలెంట్ ఎలా నిరూపించుకోవాల అని తపిస్తుంటాం.......సో క్యాచ్ లాంటి అవకాశాలు అప్పుడప్పుడు వస్తుంటాయి.........వాటిని అందిపుచ్చుకోవడమే ఆటగాడిగా (ధీరుడిగా) నీ విధి .....
ఆటగాడిగా నీ విధి నిర్వర్తించడం బాగానే ఉంది....కానీ ఒక గొప్ప ఆటగాడిగా ఎదగాలంటే తప్పని సరిగా తెలియాల్సింది ఆ ఆట ఎలా ఆడాలో తెలుసుకోవడం....జీవితం కూడా అంతే, ఎలా మెలగాలో తెలుసుకోవడమే జీవితమూ.......విజయమూ.....ఎ క్కడ ఎక్కాలో, ఎక్కడ మొక్కాలో, ఎక్కడ తొక్కాలో, ఎక్కడ నక్కాలో తెలుసుకోవడమే జీవితం అని మా మాష్టారు Akella Raghavendra గారు పదే పదే చెప్తుంటారు......సో జీవితం ఒక ఆటే కదా.......ఆట ఆడతాం సరే.....మరి విజయం సాధించాలంటే?????.....ఏమి చెయ్యాలి.......విజయం సాధించాలంటే నెట్ ప్రాక్టిస్ఉండాలి........ఆ నెట్ ప్రాక్టిస్ ఏదో ఆషామాషీ గా కాకుండా....నిబద్ధతతో, నిష్టతో చెయ్యాలి.......భారత క్రికెట్ లో ఎంతో మంది క్రికెటర్లు వచ్చిపోయారు........కాని మన సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్ కే కాకుండా ప్రపంచ క్రికెట్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోవడానికి & ఇరవై సంవత్సరాలుగా క్రికెట్ లో రారాజు గా వెలగడానికి కారణం అతని యొక్క ప్రాక్టిస్ మరియు ఆటపైన తనకున్న అంకితభావం.....కాబట్టి జీవితంలో కూడా నెట్ ప్రాక్టీస్ లాంటి ముందు చూపు పనులు కొన్ని చేస్తేనే విజయం సిద్ధిస్తుంది.....సో ఆటకైనా, జీవితానికైనా విజయం సాధించాలంటే ప్రాక్టీస్ అవసరం....అందుకే పెద్దలన్నారు.........”Prac tice makes man Perfect “ అని ……సో ప్రాక్టిస్ తో విజయానికి దారులు పరుచుకో.....అల్ ది బెస్ట్ ...... జై హింద్ .........
జీవితమే ఒక ఆట.....సాహసమే పూబాట......అన్నాడొక రచయిత. ఆట అని అన్నాడు సరే ఏ ఆట??....ఆ రచయిత ఏ ఆటను దృష్టిలో పెట్టుకొని రాసాడో మరి??.........ఫుట్ బాలా??......వాలీబాలా??....
క్రికెట్ ఆటలోని పార్మాట్లలో టెస్ట్, వన్ డే, T20, మ్యాచ్ లో ఏ ఫార్మాట్ అయినా కానీ ప్రతీ బ్యాట్స్ మన్ సెంచరీ కొట్టాలనే వస్తాడు. అలాగే నిజజీవితంలో మానవుడు కూడా వందేళ్ళు బ్రతికి సెంచరీ కొట్టడమే కాకుండా జీవితాన్ని సాఫీగా సాగదీయాలని అనుకుంటాడు. చెప్పాగా మన జీవితం క్రికెట్ లాంటిదని.....ఆడదామని బాగానే వస్తాం......కానీ అప్పుడప్పుడు యార్కర్ లాంటి ప్రమాదపూరిత కష్టాలూ వస్తాయి.......ఆ యార్కర్ బంతిని ఎదుర్కొనకపోతే క్రికెట్ లో అయితే వికెట్ ను, మన జీవితం లో ఐతే కాన్ఫిడెన్సుని కోల్పోవాల్సి వస్తుంది.....అలాగే బౌలర్ దేవుడికి కొంచెం కోపం వస్తే మాత్రం ఆ కసినంతా కూడగట్టుకుని మొఖం పైకి ఫుల్ టాస్ వేస్తాడు.....ఆ ఫుల్ టాస్ ని చాకచక్యంగా ఎదుర్కోకుండా డీలాగా ఉన్నామనుకో , హెల్మెట్ ఉన్నా సరే మొఖం పచ్చడవొచ్చు....యార్కర్లు..
ఆటగాడిగా నీ విధి నిర్వర్తించడం బాగానే ఉంది....కానీ ఒక గొప్ప ఆటగాడిగా ఎదగాలంటే తప్పని సరిగా తెలియాల్సింది ఆ ఆట ఎలా ఆడాలో తెలుసుకోవడం....జీవితం కూడా అంతే, ఎలా మెలగాలో తెలుసుకోవడమే జీవితమూ.......విజయమూ.....ఎ

Excellent chala baga rasaaru
ReplyDelete