Saturday, 19 March 2016

"ఉద్యమ బలిదానాలు"

"ఉద్యమ బలిదానాలు"

ఉద్యమాలు కోరుకునేది పోరాటాలే కానీ.....బలిదానాలు.....కాదు......ఏ ఉద్యమ కారుడికయినా భవిష్యత్తు పైన ఆశ ఉండాలి, ఉద్యమం కోసం ఆరాటం ఉండాలి, ముఖ్యంగా ఉద్యమ కారుడికి ఆత్మస్తైర్యం, నిబ్బరం ఉండాలి...పరిస్తుతులెటువంటివయినా ఎదురొడ్డి పోరాడే మనస్తత్వం ఉండాలి.ఉద్యమమే ఊపిరిగా బ్రతికే ఈ ఉద్యమకారులకు మరియు కొందరు సామాన్య జనాలకి ఈ నాయకుల పోకడలు నచ్చకపోవచ్చు.......మన నాయకులకు కావలసింది ఓట్లు-నోట్లు (కొందరు అలా ఉండరులె!)........కొందరు గల్లిలో ఉద్యమాన్ని తాకట్టు పెట్టిండొచ్చు, కొందరు ఢిల్లీలో ఉద్యమాన్ని తాకట్టు పెట్టిండొచ్చు...డబ్బు కోసం ఉద్యమం తాకట్టు పెట్టే దగాకోరులు వాళ్లు......అదంతా ఎందుకంటే....వాళ్ల వాళ్ల ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటున్నారు.......మరి ఎంతో భవిష్యత్తున్న మీరు ఎవరి ప్రయోజనం కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు....




              బలిదానం చేసుకునేటంత ధైర్యం మీకుందంటే మీరు జీవితం లో ఎంతో ఎత్తుకు ఎదికే భవిష్యత్తు మీకు ఉండటమే కాక మీరు జీవితంలో ఎంతో సాధించే సత్తా మీకుంది.ఆ ధైర్యాన్ని సరైన మార్గంలో పెట్టండి.దయచేసి ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు.ఏ ఉద్యమంలో అయినా ప్రాణార్పణ చెయ్యల్సింది నాయకుడు, ముందుండి నడిపించాల్సిందీ ఆ నాయకుడే (మీకు అర్థం అయ్యే ఉంటుంది నేను ఏ నా....య....కుల గురించి మాట్లాడుతున్నానో).కానీ ఇంతవరకు ఏ నాయకుడు ఆత్మ బలిదానం చేసుకోలేదు.వాళ్లకు బాగా తెలుసు బలిదానం చేసుకుంటే ఏమి జరుగుతుందో.అందుకే చావరు.వాల్లు చస్తే ఉధ్యమం విజయవంతమవుతుందని నేను చెప్పట్లేదు.వాల్లు జనాల కోసం చావరని చెప్తున్నా.అయినా జనాల కోసం చచ్చే నాయకులు ఏనాడో ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు.....ఈ నాయకుల నుండి మనం ఎక్కువ ఆశించొద్దు, ఒక్క సానుభూతి తప్ప.ఒక వారం లో ఎన్నో ఆత్మహత్యల వార్తలు పేపర్ లో చదివుతుంటా.అందులో ఒక్కటయినా ఉద్యమ బలిదానం ఉండకపోదు (దేవుడి దయవల్ల ఈ మధ్య ఎక్కువ బలిదానాలు లేవు). ఆ బలిదానాలు నన్నెంతో వేదనకు గురి చేస్తున్నాయి........నాకే కాదు మనసున్న ఎవ్వదికైనా వేదన కలుగుతుంది...మన కళ్ళల్లో నీళ్లు తెప్పించేవిలా వాళ్ల బలిదానాలుంటున్నాయి........ఎంతో మంది భావి నిర్మాతలు ఉద్యమానికై అశువులు భాస్తున్నారు.ఎన్నో ఆశలు పెట్టుకొని చదివిస్తున్న తల్లిదండ్రులకు గర్భ శోకాన్ని మిగులుస్తున్నారు.చచ్చేంత ధైర్యం ఉన్న నిన్ను కోల్పోవడం ఉద్యమానికి కూడా తీరని లోటు.నీ బలిదానం ప్రత్యక్షంగా ఎవరికీ ఉపయోగపదనప్పుడు నీవు చావడం దేనికీ- శోకాలు మిగల్చడం దేనికీ.బలిదానం వల్ల చరిత్రలో కొన్ని రోజుల్లో కలిసిపోతావ్....ఉద్యమకారుడిగా ముందుకి నడిస్తే చరిత్రలో నిలిచిపోతావ్....ఉద్యమంలో కష్టాలూ, నష్టాలూ తప్పవు.అలాంటప్పుడు శ్రీ శ్రీ చెప్పిన 

పోనీ, పోనీ,
పోతే పోనీ!
సతుల్, సుతుల్, హితుల్ పోనీ!
పోతే పోనీ!
రానీ, రానీ,
వస్తే రానీ!
కష్టాల, నష్టాల్,
కోపాల్, తాపాల్ , శాపాల్ రానీ!
వస్తే రానీ!
తిట్లూ, రాట్లూ, పాట్లూ రానీ!
రానీ, రానీ!

లాంటి కవిత గుర్తుకు తెచ్చుకొని ముందుకి సాగిపో....నువ్వు అమరుడవయ్యాక ఏమిచేయగలం...శ్రీ శ్రీ గారి ఇంకో కవిత
తలవంచుకు వెళిపోయావా , నేస్తం!
సెలవంటూ ఈ లోకాన్ని వదిలి

దొంగలంజకొడుకులసలె మెసలే ఈ
ధూర్తలోకంలో నిలబడజాలక
తలవంచుకునే వెళిపోయావా, నేస్తం!
చిరునవ్వులనే పరిషేచనచేస్తూ...

అంటూ కొన్ని రోజులు పాడుకోగలం...నీ కనురరెప్పలనార్పి ఎవరి కనులు తెరిపించాలనుకుంటున్నావ్ నేస్తం!.ఇక్కడ చాలా మంది నాయకులకు ఏనాడో కళ్ళు మూసుకొని పోయాయోయ్ నేస్తం!.......మేమిస్తాం- మేం తెస్తాం అంటున్నారు నాయకులు.......వాడిస్తాడో-తెస్తాడో-చస్తాడో ఎవరికెరుక నువ్వు మాత్రం ఎందుకు చావడం.శాంతియుతంగా ఉద్యమం చేస్తూ పోరాడు....ఈ రోజు ఈనాడు పేపర్ లో చదివిన సాయినాథ్ గాంధి ఆసుపత్రిలో త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ...ఉద్యమాలకై ఆత్మార్పణ చేసుకోవద్దని కొందరిని వేడుకుంటూ.....చివరగా చిన్న మాట,
“చచ్చి ఏమి సాధించలేం.....నీ వాళ్లకి కన్నీళ్ళు మిగల్చడం తప్ప”.

జై హింద్ 

No comments:

Post a Comment