భారతీయమా .............నువ్వెక్కడ???
అఖండ భారతావని ప్రపంచ దేశాలలో తనకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని ప్రతిష్టించుకొంది...ప్రపంచ దేశాలన్నింటిలో దాదాపుగా ప్రతీ దేశంలోనూ భారతీయులు నివసిస్తున్నారు...స్వాతంత్ర్యానికి పూర్వం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయక్కుండా మనకు స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టారు..స్వాతంత్ర్య సంగ్రామంలో చిన్నా,పెద్దా తేడా లేకుండా, ఆడ-మగ అనే లింగ భేదం కూడా లేకుండా ప్రతీ ఒక్కరు తమ రక్తాశ్రువులను చిందించినవారే..అప్పటి రోజుల్లో ప్రాంతీయ తారతమ్యాలు ఉన్నప్పటికినీ తామంతా భారతీయులం అనే భావన నరనరాన జీర్ణించుకున్న వారే ఎక్కువ...ఆ సమయాన మనం ఎవరిని కదిపినా వారిలో భారతీయులం అనే జాతీయ భావన కనిపించేది..నేటి పరిస్థితులందుకు భిన్నంగా వున్నాయి...
అప్పటివారు ‘‘నేను మొదట భారతీయున్ని’’ తరువాతే ఇంకేదైనా అనేవారు....కానీ నేడు ప్రాంతీయ భావజాలం పెరిగిపోయింది...మనది అనే మాట మరచి నాది అనే సంకుచిత స్వభావాలు పెల్లుబికి వస్తున్నాయి....ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది జనం నా ఊరు, నామండలం,నాజిల్లా, నారాష్ట్రం, నాప్రాంతం అంటూ ప్రాంతీయభావాలతో పాటుగా నామతం, నాకులం, నావర్గం అన్న సంకుచిత ధోరణిలో బ్రతుకుతున్నారు....అంతేకాకుండా నీది దక్షిణ భారతదేశం, నాది ఉత్తర భారతదేశం అంటూ మనుషుల మనస్సుల్లో గోడలు కడుతున్నారు...ఇంకా చెప్పాలంటే అక్కడెక్కడో ఈశాన్య భారతంలోని ప్రజల గురుంచి పట్టించుకునే నాధుడు చాల సందర్బాల్లో లేరు...ఆ ప్రాంతంల్లో ఒక మహిళ (షర్మిల ఇరోమ్) గత పది సంవత్సరాలుగా దీక్ష చేస్తున్నా ఆమెను పత్రికల వాళ్ళు పలకరించిన సందర్భాలను వేళ్ళపై లెక్కపెట్టవచ్చు....ఆమె గురించి తెలిసిన భారతీ- యులెందరు??....మనకు భారతీయులం అనే భావనలు లేవా???? అంటే ఎందుకు లేవు చాలా పుష్కలంగా ఉన్నాయి...
జై హింద్

No comments:
Post a Comment