Saturday, 19 March 2016

గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి నాన్నా??


గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి నాన్నా??



ఝాన్సీ: నాన్నా.....అప్పుడు స్వాతంత్ర్య దినోత్సవం గురించి చెప్తూ......గణతంత్ర దినోత్సవం గురించి చెప్పమంటే ఆ రోజు వచ్చినప్పుడు చెప్తానన్నావ్ కదా.......ఇప్పుడు చెప్పు నాన్నా.......

భరత్: చాలా సంతోషం తల్లీ......నువ్వు గుర్తు పెట్టుకుని మరీ మన దేశం గురించి తెలుసుకోవాలనుకుంటున్నావ్.......... 

ఝాన్సీ: నాన్నా.....నువ్వు స్వాతంత్ర్య దినోత్సవం గురించి చెప్పినప్పటి నుండీ నాకు మన దేశం అంటే చాలా అభిమానంతో కూడిన ప్రేమ కలిగింది......తొందరగా చెప్పు నాన్నా పొద్దున్నే నిద్ర లేచి స్కూల్ కి వెళ్లాలి....

భరత్: హమ్మా......ఐతే నీకు అర్థం అయ్యేలా చాలా ఈసిగా చెప్తా విను......

ఝాన్సీ:ఐతే ....చెప్పు నాన్నా.....

భరత్:నీకు క్రికెట్ గురించి తెలుసా .....

ఝాన్సీ:ఓ....తెలుసుగా....

భరత్: ఐతే నీకు గణతంత్ర దినోత్సవం గురించి చెప్పటం చాలా ఈజి.....గణతంత్ర దినోత్సవం అంటే రాజ్యాంగం అమలులొకి వచ్చిన రోజు...

ఝాన్సీ: రాజ్యాంగం అంటే ఏంటి నాన్నా?.......

భరత్:రాజ్యాంగం అంటే.....భారత దేశ ప్రజలమైన మనము....మనకు మనమే రూపొందించుకున్న రూల్స్ అండ్ రెగులేషన్స్....

ఝాన్సీ: మరి..ఈ రోజుకి, క్రికెట్ కి ఎంటి సంబంధం?

భరత్: క్రికెట్ లొ ఆటగాళ్ల ఆటను కంట్రొల్ చేసేది ఎవరూ?....

ఝాన్సీ:ఇంకెవరు.....అంపైర్....

భరత్: హా...కర్రక్ట్....క్రికెట్ లో అంపైర్ లేకపోతే ఏమవుతుందీ??...

ఝాన్సీ: ఏముంది నాన్నా...ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు ఆటలో రూల్స్ మారుస్తారు....గొడవలు కూడా జౌగొచ్చు....

భరత్: కదా...అలా ఆటలో రూల్స్ మారకుండా అక్కడ అంపైర్ ఎలాగయితే ఉన్నాడో....ఇక్కడ రాజ్యాంగం అలా ఉంది....
ఆ ఆటలో అంపైర్ చెప్పిందే వేదం కదా తల్లీ.....ఇక్కడ రాజ్యాంగం చెప్పిందే వేదం అన్నమాట.....

ఝాన్సీ: ఓకె....ఓకె....

భరత్: ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ...ఆటలో అంపైర్ చెప్పినట్టు ఎలా వినాలో ఇక్కడ మనం రాజ్యాంగం చెప్పినట్టు వినాలి.....అంతే...తేడా.....

ఝాన్సీ:భలే చెప్పావ్ నాన్నా...ఒకే నాన్న...ఇంకా వినాలని ఉంది..కానీ...నాకు నిద్దరొస్తుంది.....మల్లీ ఎప్పుడైనా.....ఇంకొన్ని విషయాలు మాట్లాదుకుందాం లే....నాన్నా

భరత్: సరే లే.....పడుకో...కానీ..పడుకోబోయే ముందు ఒక చిన్నమాట.....ఆటలో మంచిగా ఆడడం ఎంత ముఖ్యమో.....ఆటలో రూల్స్ అండ్ రెగులేషన్స్ పాటించడం కూడా అంతే ముఖ్యం....ఒక్కోసారి అంపైర్ తప్పుడు నిర్ణయం తీసుకొవచ్చు, ఎంకేదయినా విషయం లో నీకు అన్యాయం జరగొచ్చు.....కానీ నూవ్వు మాత్రం ఆటనీ మరియు అంపైర్ ని ఒక నిజాయితీగల ఆటగాడిగా గౌరవించాలి....ఆటను గౌరవించాడు కాబట్టే మన సచిన్ భారతరత్నం అయ్యాడు....నువ్వు కూడా ఆటలాంటి మన రాజ్యాంగాన్నీ, మన రాజ్యాంగపు విలువలనీ గౌరవిస్తూ......భారత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు తెలిసేలా చెయ్యాలి....ఇంకా ఎన్నో గొప్ప విషయాలు మన రాజ్యాంగంలొ ఉన్నాయి....అవన్నీ నీకు కొంచం పెద్దయ్యాక చెప్తాలే తల్లీ ......

ఝాన్సీ: ఐతే ఓకె......అవును నాన్నా.....మన రాజ్యాంగం ఎప్పటినుండి అమలులోకి వచ్చింది?

భరత్:నవ్వుకుంటూ........అమలులోకి వచ్చింది 1950 జనవరి 26 తో, ఆమోదించుకున్నది 1949 నవంబర్ 26 న తల్లీ.....

ఝాన్సీ:నాన్నా.....ఎందుకు నవ్వుతున్నావ్?........

భరత్:నిన్ను చూసి నవ్వట్లేదు తల్లీ.......మన రాజ్యంగం ఎప్పుడు అమలులోకి వచ్చిందో....అసలు గణతంత్ర దినోత్సవం అంటే ఏంటో....చాలా మంది భారతీయులకి తెలీదు....

ఝాన్సీ:ఐతే.....రేపు నేను.....మా స్కూల్ కి వెళ్లిన వెంబడే....మన రాజ్యంగం ఎప్పుడు అమలులోకి వచ్చిందో....అసలు గణతంత్ర దినోత్సవం అంటే ఎంటో..అని మా టీచర్లనీ, నా ఫ్రెండ్స్ ని అడుగుతా....ఎంత మంది సమాధానం చెప్తారో చూస్తా.....హమ్మో....12;30 అవుతుందే....ఓకే....ఓకే...నాన్నా..రేపు మాట్లాదుకుందాం...గుడ్ నైట్....అండ్......హాప్ప్యిరిపబ్లిక్ డే.....

భరత్: గుడ్ నైట్....అండ్......హాప్ప్యి రిపబ్లిక్ డే.....తల్లీ......(మనలో మన మాట మీకు కూడా ఆ....రెండు ప్రశ్నలు తెలియకపోతే తెలుసుకోండి, తెలిస్తే తెలియని వాళ్లకి చెప్పండి )......

No comments:

Post a Comment