Saturday, 19 March 2016

"తెలంగాణమా?? సమైక్యమా"

"తెలంగాణమా?? సమైక్యమా"





ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితిలో ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా ఏదో ఒక సందర్భంలో వారి మధ్య జరిగే సంభాషణలో తప్పనిసరిగా ఉదయించే ప్రశ్న తెలంగాణ వస్తుందా ?? రాదా?? ప్రస్తుతానికి ఇది సమాధానం దొరకని ప్రశ్నే....ఆ మద్య ఎవరో ఒకాయన ఒక తెలుగు ఛానల్ యజమానిని తెలంగాణ వస్తుందా అంటే దానికి ఆయన సమాధానం, సోనియా నాకు చెప్పలేదనడం....మనరాష్ట్ర పరిస్థితులను మనం ఇలా దేశం ముందు పెట్టి అందరూ మనవైపు చూసి నవ్వుకునేలా చేసుకున్నాం....దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజలూ, ఆప్రజలు నమ్మకంతో ఎన్నుకొన్న మన సోకాల్డు రాజకీయనాయకులు కారణం......రాజకీయనాయకులదే పూర్తి బాధ్యత అని అనలేం.....అలా అని కాదని తీసిపారేయలేము......అందరికీ తెలిసిన విషయాలయినప్పటికి కొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావించుకుందాం......1956 లో మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రంగా అవతరించి ఘనకీర్తిని సంపాదించుకున్నాం.....ఆ తర్వాత కొన్ని ప్రత్యేక సదుపాయాలంటూ 1.పెద్ద మనుషుల ఒప్పందం, 2.ఆరు సూత్రాలు, 3.610 జి.వో 4.610 జి.వో అమలు తీరుపై సమీక్షకై వేసిన గిర్ గ్లానీ కమీషన్ లాంటి కొన్ని ప్రత్యక సదుపాయాలు తెలంగాణ ప్రజలకు ఇవ్వబడ్డాయి.....ఈ సదుపాయాలన్నీ విజయవంతంగా అమలు కాకపోవటం, తమ ప్రాంతాన్ని పట్టించుకోకుండా వివక్షను ఎదుర్కొంటున్నామని, అందుకే తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణ వాదుల వాదన....






                                    ఇదిలా వుంటే ఆంధ్రప్రదేశ్ అవతరణ నాటికి అసువులు బాసిన పొట్టిశ్రీరాములు త్యాగఫలంగా ఏర్పడిన ఆంధ్రరాష్ట్రం....తరువాత విశాలాంధ్రగా ఏర్పడటానికి కారణం ఇటూ అటూ నాయకులు సమిష్టి కృషి ఫలితమేనని,అంతేకాదు ఎంతో సంయమనం పాటించి 1972 తర్వాత జై ఆంధ్రా ఉద్యమము వెనక్కితీసుకోవడం జరిగిందని..... అందరం కలసి రాష్ట్రాన్ని, రాష్ట్రరాజధానిని అభివృధి చేసుకొన్నామని సమైఖ్య వాదుల వాదన.....ఇప్పుడు ఇక్కడంతా హైదరాబాదు పెద్దసమస్యగా మారిందనీ......కాదు......కాదు....హైదరాబాద్ ని అలా పెద్ద సమస్యగా కొందరు స్వార్థ రాజకీయ నాయకులు చిత్రీకరిస్తున్నారు.......హైదరాబాద్ వెళ్ళాలంటే మీకు “వీసా”లు తప్పనిసరి కావచ్చు..........అని ఒకమహానేత సమైక్యాంధ్రులకు హెచ్చరించి వారిలో ఒక విద్వేషపూరిత వాతావరణం నెలకొల్పారు ........ఇంకా హైదరాబాద్ లో ఇంకో ఆయనేమో “జాగో –బాగో” అంటూ ఇంకొంతమంది మనసులో అలాంటి విద్వేషపూరితాలే రెచ్చగొట్టారు......ఒకాయనేమో దళం తయారు చేస్తానంటాడు, ఇంకో ఆయనేమో మీరు దళాలు తెస్తే మేం చూస్తూ కుర్చోమంటాడు ......ఇంకో ఆయనేమో ప్రత్యక్ష దాడులు తప్పవంటాడు...దానికి బదులుగా ఇంకో పెద్దాయనేమో నాలుకలు కోస్తాం జాగ్రత్త అంటారు...... ఇదేదో నేను నా ఇష్టానికి రాసిన పిచ్చిరాతలు కావు.....గత కొన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రంలోని దయనీయ పరిస్థితులివి..........ఇక్కడ ఏ కొందరినో విమర్శించడం నా ఉద్దేశం ఏమాత్రం.... కాదని మీరు దయచేసి అర్థం చేసుకోగలరు.......





                                    కారణాలు ఏమైనప్పటికీ జనాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కొందరిని ఆత్మహత్యలు చేసుకునేంతగా పరిస్థితులు దయచేసి చేయొద్దని మనవి....... రాజకీయనాయకులు ప్రత్యేక గన్మెన్లతోనో, లేక “z” కేటగిరి భధ్రతతోనో తిరుగుతూ వున్నారు.......అంతేకాదు విద్వేషాలు రెచ్చగొట్టిన ఆ నాయకులే అసెంబ్లీలో, పార్లమెంట్లో ఇక ఇకలు పకపకలు (ఇప్పుడు వారిలో కూడా ఈ పరిస్థితి లేదు...వేరే విషయం ) పండిస్తూ హాయిగా తిరుగుతున్నారు ...కానీ రాష్ట్రం లో పరిస్థితి అల లేదు.
మన రాష్ట్రంలో పరిస్థితులు ఎంతలా దిగాజరాయంటే “తెలంగాణా” అంటే బూతుపదం గానూ , సమైక్యాంధ్ర అంటే గలీజు గానూ ఇరుప్రాంతల వారు అనుకునేలా మారిపోయాయి ....విద్వేషాలు రెచ్చగొట్టిన రాజకీయనాయకులు అందరు బాగానే ఉన్నారు .కానీ ఆ విద్వేషాలు పునికిపుచ్చుకున్న కొంత మంది ప్రజలు మాత్రం జరగరాని ఘోరాలు జరిగినట్టుగా చేస్తున్నారు...అంతే కాదు , ఇటీవల చౌటుప్పల్ లాంటి ప్రాంతాలల్లో ఒక వైపు నుండి వచ్చే బస్సులపై ఒక వర్గం దాడి , ఇంకో వర్గం వారు తూర్పుగోదావరి జిల్లాలో వేరే ప్రాంతం వర్గం పై దాడి ...ఏంటో ఈ నాగరికం.....ఇదేనా మన దేశం ఇచ్చిన సంస్కృతి లాంటి భారీ డైలాగులు చెప్పటం నా ఉద్దేశం కాదు.అందరు విజ్ఞతతో సంయమనం పాటించాలనేది నా ప్రధాన ఉద్దేశం.



                                      సమస్యకు పరిష్కార మార్గం కనుగొనాలే తప్ప, దాడులు-ప్రతి దాడులు అంటూ సమస్యను జటిలం చేయకూడదు..... 2009 డిసెంబర్9 నాటికి రాష్ట్రం లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉంది.తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా పెరిగింది .ఈ నేపథ్యంలో వచ్చిన శ్రీ కృష్ణ కమిటీ వల్ల ఒక సంవత్సరం పాటు ఇరు వర్గాల ప్రజలు సంయమనం తో ఓపిక పట్టి ఎదురుచూశారు...తీరా తీర్పు ఇచ్చిన విధానం మాత్రం మరీ హాస్యాస్పదం...ఆరు నిర్ణయాలు ప్రకటిస్తున్నాం వాటిలో ఒకటి చూస్ చేసుకోండి అంటూ , “తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి” అనే సామెతను అక్షర సత్యం చేసేలా శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది.ఈ మధ్యనే తెలంగాణ ప్రజలంతా సకల జనుల సమ్మె లో పాల్గొనడం, విరమించడం జరిగింది.సమ్మె ప్రభావం ఉందనీ చెప్పలేం , లేదనీ కొట్టిపారేయలేం .ఈ సమ్మె కారణంగా ఎంతో మంది ఇబ్బంది పాలయ్యారు.ప్రత్యేకంగా రాజధాని ప్రజానీకం ఇబ్బంది పడ్డారు.సమ్మెకార్లు కష్టాన్ని భరిస్తాం అంటే , సమైక్యాంధ్రవాదులు పెదవి విరుస్తున్నారు.....
ఎంతకాలం ఈ విద్వేషాలు , వైషమ్యాలు???...దీనికి పరిష్కార మార్గం కనుగోనేలా తమ తమ స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి రాజకీయనాయకులు పరిష్కారం కోసం ఆలోచించాలి...సమస్యను ఎంత తొందరగా పరిష్కరిస్తే అది ఇరు వర్గాల వారికి ఎంతో మంచిది .సమస్య పరిష్కారం కావాలంటే ఇరు వర్గాలల్లో, ఏ ఒక్క వర్గం అయినా తమ కోరికలు త్యాగం చేసి సర్దుకుపోతే సమస్య పరిష్కారం అవుతుంది......లేదా ఇరువైపులా నుండి మేధావులు నిష్పక్షపాతంగా సమస్యకి పరిష్కారం కనుక్కునేల చర్యలకు పూనుకోవాలి..... .కానీ ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఎవరు త్యాగం చేసేలా పరిస్థితులు కనిపించటం లేదు.......అలాగే మేధావులు చర్యలకు పూనుకులే లేరు........కావున ఈ సమస్యకు కాలమే పరిష్కారం చెప్పాలి.......అప్పటి వరకు అందరం సంయమనం తో వేచి చూద్దాం.... .....
.జై హింద్

No comments:

Post a Comment