ఊయలలో హాయిగా ఊగుతున్న నన్ను చూసి మా అమ్మ (చదువురాని) బాధపడుతుంది – భయపడుతుంది ,
చదువుకున్న మారాజులైన మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,
చదువుకున్న చదువులకి పరమార్థం తెలియని మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,
మా కులమే గొప్ప అనుకునే మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,
మా మతమే గొప్ప అనుకునే మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,
మీ భావప్రకటన స్వేచ్చ ఇంకొకరికి స్వేచ్చకి భంగమా అని ఆలోచించని మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,
ఒక ఉగ్రవాదిని ఉరితీయడం తగదు అని ఊరేగింపులు చేసే మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,
వ్యక్తుల భజన చేస్తూ వ్యవస్థ ఏమైపోతేనేమి అనుకునే మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,
తప్పు చేసే నాయకుడిని వెనకేసుకొచ్చే మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,
భారతీయులందరూ నా సహోదరులు అని పాటశాలల్లో చేసిన ప్రతిజ్ఞ మీరు మరిచారా? అని మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,
ఎన్నుకున్న ప్రభుత్వాలపైన గౌరవం లేని మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,
ప్రభుత్వ కార్యాలయాల్లో నిజాయితీగా పని చేయించుకోవడం చేతకాని మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,
తప్పు చేసేవాడిని నిలదీయలేని పిరికివాల్లైన మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,
ఆడవాళ్లను అంగట్లో సరుకులా చూసే మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,
జాతీయ పండుగలంటే సెలువులు అనుకునే మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,
మువ్వన్నెల జెండా కున్న పొగరు మీ నరాల్లో లేని మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,
దేశ ప్రజలందరూ నా వాళ్లు అనుకోని మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,
వ్యక్తిగత హితం కన్నా భారతదేశ హితమే గొప్ప అనుకోని మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,
భిన్నత్వంలో ఏకత్వం అంటే అర్థమే తెలియని మీ అజ్ఞానాన్ని చూసి మా అమ్మ భయపడుతుంది,
భారతదేశ ఔనత్యం గురించి అంతగా తెలియని మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,
భారత జాతి గౌరవం కోసం ఆలోచించని మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది- బాధపడుతుంది,
భారతీయుల శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం అని మీరు చేసిన ప్రతిజ్ఞ మరిచారా? అని మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,
నా లాంటి భావి భారత పౌరుల భవిష్యత్తు గురించి ఆలోచించని మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది- బాధపడుతుంది,
మా అమ్మ భయపడకుండా – బాధపడుకుండా చూసుకుంటానంటేనే ఈ ఊయల నుండి దిగుతా,
లేదంటే
ఈ ఊయలలో ఇలాగే కళ్ళు మూస్తా........
మా అమ్మ (భరతమాత) కోసం కాకపోయినా బుడిబుడి అడుగులే వేయని నా కోసం మారతారని కోరుకుంటూ.......
భారతీయులకి ప్రేమతో, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ
మీ చిట్టి చెల్లి భారతి..................
జై హింద్.......

No comments:
Post a Comment