ఈ పెద్దాళ్లున్నారే.
ఈ పెద్దాళ్లున్నారే......పెద్ద పనికిమాలిన వాళ్లు......వాళ్లకు ఎప్పుడూ డబ్బు పిచ్చి.....అధికార పిచ్చి......అహంకార పిచ్చి......ఇంకా ఎన్నో అడ్డమైన పిచ్చులున్నాయి........ఆ పిచ్చిల ఫలితం కొందరి ప్రాణాలు తీస్తుంది.......కొందరిని వాళ్లకి బానిసల్ని చేసుకుంటుంది.....ఇంకొందరిని పురుగుల కంటే హీణంగ చూసేలా చేస్తుంది.....ఆ పెద్దాళ్లు తమ కనుసున్నల్లోనె అన్నీ జరిగిపోవాలనుకునే మదపిచ్చితో కొట్టుకొని చస్తుంటారు.....వాళ్లని అలా తయారుచేసింది ముమ్మాటికీ బుఱ్ఱలేని , తెలివిలేని, కొందరు పిచ్చి జనాలే......కొందరు తాము అమ్మ నాన్నకు పుట్టినట్టు కాకుండా అదేదో కులానికే పుట్టినట్టు ప్రవర్తిస్తూ తమకు ఇష్టమైన నాయకులని గుడ్డిగా ప్రేమిస్తుంటారు.....అదేమిటీ అంటే అభిమానం అంటారు......వీళ్ళ అభిమానం పాడుకాను........తు వెధవ బ్రతుకు.....అబిమానం ఉండాలే కానీ మితిమీరిన అభిమానం దేనికి.....వీళ్ల అబిమానం ఏ రోజయిన కడుపునిండా తిండి పెదుతుందా అంటె అదీ ఉందదు...... మరి ఎందుకంత అభిమానం .....వామ్మో దాన్ని అభిమానం అంటే చాలా తప్పువుతుంది ...అది అభిమానం కాదు ఎఱ్ఱి అని జనాలంటారు.....ఒకరు చనిపొతే దానికి కారణం కొన్ని కుటుంభాలే అని దుమ్మెత్తిపోయడం కాదు ....అలా వాళ్లని విర్రవీగేలా చేసింది మనం కాదా.......తప్పంతా మనది పెట్టుకుని ఎవర్నో.... అని ఏం లాభం..... మనిషి మనిషి గా ఆదరించండి......కులానికో, మతానికో, డబ్బుకో పుట్టినట్టు కాకుండా మనిషికి పుట్టినట్టు మనిషిగా పుట్టినట్టు ప్రవర్తించండి......మనిషిని ఆరాధించడం మానుకొని వ్యవస్థను ఆరాధించడం, వ్యవస్థలొని మంచిని ఆరాధించడం నేర్చుకుంటే ఏ ఒక్కరూ తక్కువ కాదనే భావం అందరిలో కలిగి మనది వసుధైక కుటుంభం అవుతుంది....ఆఖరుగా ఒక చిన్నదైన పెద్దమాట మనిషి మనిషి గా ఆదరించండి......కులానికో, మతానికో, డబ్బుకో, అధికారానికో, అహంకారానికో పుట్టినట్టు కాకుండా మనిషిగా పుట్టినట్టు మనిషికే పుట్టినట్టు ప్రవర్తించండి.....అలా మనిషులని మనుషులగా చూసే వారినే గౌరవించండి ...
గమనిక : ఇక్కడ నేను రాసిన రాతలు ఎవరినీ ఉద్ధేసించి రాసినవు కాదు (ఇది కూడా వాళ్లు నేర్పిందే)
జై హింద్
No comments:
Post a Comment