Saturday, 19 March 2016

"నెగటివ్ ఓటింగ్"

"నెగటివ్ ఓటింగ్"

భారత ప్రజాస్వామ్యంలో నెగటివ్ ఓటింగ్ (నకారాత్మక ఎన్నిక) అనేది చాలా మంచి పరిణామం..నేను ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నా మన దేశంలో ఈ వ్యవస్థని ప్రవేశపెట్టాలని..ఎట్టకేలకు మన అత్యున్నత న్యాయస్థానం పచ్చ జెండా ఊపింది........ప్రపంచంలో ఇప్పటి వరకు ఈ వ్యవస్థ 13 దేశాల్లో (France, Belgium, Brazil, Greece, Ukraine, Chile, Bangladesh, State of Nevada, Finland, the United States of America, Colombia, Spain and Sweden) ఉంది.....అక్కడి రాజకీయ పరిస్థితులు మన దేశంతో పోలిస్తే విభేదించవచ్చు....కానీ ఇది మన ప్రజాస్వామ్యానికి , ఓటరుకి శుభావార్తలాంటిదే..ఈ విధానంలో ఓటరు ఎవరినీ ఎన్నుకోకుండా క్రింద ఉన్న None Of The Above (NOTA) అనే దాన్ని ఎన్నుకోవడం ద్వారా తన ఓటును ఎవరికీ ఇచ్చినట్టు కాకుండా అభ్యర్తులందరినీ ఓటరు తిరస్కరిస్తున్నాడని అర్థం....దీని వల్ల లాభమూ ఉందీ, నష్టమూ ఉందీ.....లాభం ఏంటంటే రాజకీయ పార్టీలు మంచి వ్యక్తిని పోటిలో నిలపెట్టే అవకాశం ఉంది...ఇంకో లాభం ఏంటంటే కొందరు ఓటర్లు అభ్యర్థులు నచ్చక ఓటు వెయ్యడం లేదని ఇటీవలి సర్వేల్లో తేలింది....అలాంటి ఓటర్లు తమ ఓటు హక్కుని ఇప్పుడు చక్కగా వినియోగించుకుంటారు.....ఓటింగ్ శాతం కుడా పెరుగుతుంది....ఓటింగ్ శాతం పెరిగితే అభ్యర్థుల్లో కూడా అంత మందికి జవాబుదారీగా ఉండాల్సిన స్పృహ కల్గొచ్చు...ఆ రాజకీయ స్పృహ ప్రజాస్వామ్యానికి ఎంతో మేలు చేస్తుంది...ఇక నష్టం ఏంటంటే పోలైన ఓట్లలో ఎక్కువ శాతం NOTA ఓట్లుంటే పరిస్థితి ఏంటి? అనేది స్పష్టంగ వివరించలేదు (ఉదాహరణకి 50 ఓట్లు పోలయ్యాయనుకుంటే దాంట్లో 40 NOTA ఓట్లు, మిగిలిన పది చెల్లే ఓట్లుంటే అప్పుడు పది ఓట్లు గెలుచుకున్న అభ్యర్తినే విజేతగా ప్రకటిస్తే ఈ వ్యవస్థ వల్ల లాభం లేదు కదా అనీ).....అలా వస్తే మళ్లీ ఎన్నికలకి వెళ్తారా??....ఒక్కసారి ఎన్నికలు జరిగితేనే ధనం ఏరులయి పారుతుందే అలాంటిది మళ్లీ ఎన్నికలంటే అవినీతికి, నల్లధన ప్రవాహానికి, మాల్ ప్రాక్టిసింగ్ కి దారులు తెరిచినట్టవుతుందేమో అని విమర్శకులంటున్నారు.....అలాగే ఎక్కడో చదినట్టు గుర్తు NOTA కి వెళ్ళే ఓటరు 49 O అనే ఫారం నింపాల్సి ఉంటుందంట......సో పల్లెల్లో ఉండే ఓటరుకి ఇది కొంచం కష్టమైన పనే, ఎందుకంటే మనం ఫారం నింపితే మనం ఎవరినీ ఎన్నుకోవడం లేదనే విషయం మన వెనకాల నిల్చున్న ఓటర్లకి తెలిసిపోతుంది....ఎవరూ ఎవరినీ గుర్తుపట్టని పట్టణాల్లో ఈ ఫారం వల్ల నష్టం లేదు కానీ.....పల్లెల్లో ఇలా ఫారం నింపడం కొంచం రాజకీయంగా, వ్యక్తిగతంగా ఓటరుకి పలు విధాలుగా భయం కలిగించొచ్చు (కొంచం బ్రాడ్ గ ఆలోచిస్తే మీకే అర్థం అవుతుంది ఆ ఫారం నింపడం కష్టమే అనీ)....అలా అయితే ఈ వ్యవస్థని మన దేశంలో ప్రవేశపెట్టాలా??...వద్దా??...ప్రవేశపెట్టాలి కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు-సంస్కరణల గురించి ఎన్నికల సంఘం ఆలోచించాలి.....ఎందరో మేధావులు మన దేశంలో ఎన్నికల సంస్కరణలు చేయడానికి విలువైన సమాచారం ఇవ్వడానికి సన్నద్ధంగా ఉన్నారు....వాళ్ల సహకారాన్ని కూడా ఎన్నికల సంఘం తీసుకొని ఒక మంచి ప్రజాస్వామ్య దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దాలని.....తీర్చిదిద్దుతుందని ఆశిస్తున్న ఎందరో భారతీయుల్లో నేను కూడా ఒక్కడిని.....(ఈ వ్యాసం నచ్చితే, దీని గురించి మీ సన్నిహితులకీ తెలపడానికి షేర్ చెయ్యండి, మన దేశానికి ఉపయోగపడే ఒక మంచి విషయం అందరికీ చెప్పడం కూడా దేశ సేవే కదా).....మళ్లీ కలుద్దాం...


.జై హింద్

No comments:

Post a Comment