Saturday, 19 March 2016

మన్నించమ్మా......నిర్భయ.......

ఈ దుర్యోధన దుష్యాసన దుర్వినీత లోకం లో ఒక ఆబల రక్తాశ్రువులతో ప్రాణం విడిచింది......అమ్మా, నాకు బ్రతకాలని ఉంది అని దీనంగా అడిగిన ఆ యువతికి తల్లి సమాధానం చెప్పలేక ఎంత వేదన అనుభవించిందో మనసున్న మహానుభావులకే అర్థం అవుతుంది....దేశ రాజధాని లో ....కీచక పర్వం జరిగి నెలయినా గడవలేదు....ఆ అమ్మాయి చనిపోయి వారం అయిన గడవలేదు....భారతీయులంతా కొత్త సంవత్సరం అంటూ వేడుకల్లో మునిగిపోయారు.......ఈ సంవత్సరం దేనికి కొత్త.........ఒక అభంశుభం తెలియని మహిళను అరాచకంగా చెరపడం అనే దానికా కొత్తా??...............లేకపోతే ప్రజాస్వామ్య దేశమని చెప్పుకుంటూ .......ప్రజలకు ఆ ప్రజాస్వామ్యం విలవలేంటో తేలపకపోవడంలో కొత్తా??.........ఇంకా దేనిలో కొత్త ??.........అవునూ....ఆ యువతికి మృతికి కారణం ఎవరు..........గట్టిగా పరిశీలించి చూస్తే ఈ అఘాయిత్యానికి కారణం యావత్తు భారత జాతి....అవును ఆ తప్పు ముమ్మాటికీ మన భారతీయులందరిది.....

                                    స్త్రీ ని ఒక ఆది పరశాక్తిగా పూజించే మన భారతావని లో..నేడు అబల ఆది పరశాక్తిగా కాదు కదా ఒక మనిషి గా గుర్తించబడడం లేదు........తాము జన్మించినదీ ఒక అబల గర్బంలో నుండే అనే స్పృహ ను కూడా కోల్పోయి......ఒక పైశాచికానందం కోసం జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు...........కుక్కలకు మనషులకు తేడా లేకుండా చేస్తున్నారు.......ఇలా ప్రవర్తించడానికి కారణం ఏంటి ??......పాశ్చాత్య పోకడలను గుడ్డిగా ఆచరించడమే...కొందరికి ఈ పాశ్చాత్య పోకడలంటే విదేశీ ప్రభావం అని తెలియనంతగా మన భాష పైనా ప్రభావం చూపాయి ఈ పోకడలు.............కొత్త సంవత్సరం వేడుకలంటూ డిసెంబర్ 31వ తారీకున తాగి తందనాలాడుతూ.........కళ్ళు , వొళ్ళు తెలియని పరిస్థితి లో ఉంటూ న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుంటూ................ఎంజాయ్ చేస్తున్నారు.................ఎంజాయ్ చెయ్యొద్దూ ........... ఇది మన భారతీయుల సంస్కృతి కాదంటూ సోది చెప్తే వినే మూడ్ లో వాల్లు వుండరు..............ఎంజాయ్ చేసే వాళ్ళు, నలుగురి లో నారాయణ ల ఎంజాయ్ చేస్తుంటారు.........ఎంజాయ్చేద్దాం.......కానీ మన మూలాల్ని మరిచిపోతే ఎలా??.........

                                   
ప్రపంచం తో పాటు నేనూ అంటూ ఎంజాయ్ చేస్తాం......సరే.....మరి ప్రపంచం లో ఉన్న వేరే విషయాలు మాత్రం మనకు పట్టవ్..........పాశ్చాత్యులు మన సంస్కృతి లోని అన్ని విషయాలూ నేర్చుకుంటున్నారు.............మనం కుడా నేర్చుకోవాలి......వారి యొక్క సాంకేతికతను నేర్చుకోవాలి........అలా టెక్నాలజీ ని నేర్చుకోవడం మానేసి అడ్డమయిన విషయాలు నేర్చుకున్నాం.......నేర్చుకుంటున్నాం.....కానీ మనం మంచినే నేర్చుకోవాలి.......కాని మన కర్మేంటంటే మనిషి మంచి కన్నా చెడుకే ఎక్కువ ప్రభావితుదవుతాడు....అలా జరిగిన కొన్ని చెడు ప్రభావాలే ఈ డిల్లీలో జరిగిన ఉదంతం...........దీనికి బాధ్యత అంతా మన సమాజం లోని మంచి వారు చెడ్డ వాళ్లకు ఏది చెడు ఏది మంచి అని చెప్పకపోవడం వల్లనే........ఒక క్రూరుడి ఆకృత్యం కన్నా ఒక మేధావి /మంచి వాడి మౌనం సమాజానికి ఎంతో కీడు చేస్తుంది.........................అలా మంచి వాల్ల మౌనానికి కారణమే నేటి ఈ రాజధాని ఉదంతం..........సో సమాజం లో ఉన్న ప్రతి వ్యక్తి బాధ్యత, మంచిగా మెలగడం.........ఒక కొడుక్కి ఎలా ఉండాలో చెప్పకపోతే అది తల్లిదండ్రుల తప్పు......ఒక సోదరి తన సోదరునికి ఎలా ఉండాలో చెప్పకపోవడం ఆమె తప్పు........ఇలా మనిషి ప్రవర్తను తీర్చిదిద్దేది సమాజంలోని మనం..........ఒక మనిషి ఎలా ఉండాలో అతనికి చెప్పకపోవడం ఒక సమాజం తప్పు..........సమాజం అంటే వ్యక్తి.......వ్యక్తి అంటే సమాజం..........ఆ సమాజం లో నేనూ ఉన్నాను కాబట్టి నన్ను క్షమించమ్మా........................ 

No comments:

Post a Comment