Saturday, 19 March 2016

"స్వాతంత్ర్య దినోత్సవం అంటే ఏంటి ?????నాన్నా??????"


"స్వాతంత్ర్య దినోత్సవం అంటే ఏంటి ?????నాన్నా??????"



ఝాన్సీ ( పాప ): నాన్నా...రేపు మా స్కూల్లో జెండా పండుగ ఉందంట......దాని గురించి మేము స్టేజి ఎక్కి
మాట్లాడాలంట.
భరత్ ( నాన్న) : ఓహో ...అయితే నువ్వు స్టేజి ఎక్కి మాట్లాడుతావా?
ఝాన్సీ : ఊ...తప్పకుండా మాట్లాడుతా నాన్నా...నాకేంటి భయ్యం..కానీ నాకు జెండా పండుగంటే తెలీదు
కదా!.మరి నువ్వు నాకు చెప్తావా?.
భరత్ : తప్పకుండా తల్లీ...మనకు సంవత్సరంలో రెండు జెండా పండుగలు వస్తాయి.ఒకటి స్వాతంత్ర్య
దినోత్సవం, మరోటి గణతంత్ర దినోత్సవం.
ఝాన్సీ : అయితే, మనం రేపు జరుపుకునేది ఏ పండుగ నాన్నా?..
భరత్ : రేపు జరుపుకునేది స్వాతంత్ర్య దినోత్సవం తల్లీ...
ఝాన్సీ : మరి గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి?అది ఎప్పుడు జరుపుకుంటాం.స్వాతంత్ర్య దినోత్సవం అంటే
ఏమిటి?ఎందుకు జరుపుకుంటాం.
భరత్ : గణతంత్ర దినోత్సవం ఎందుకు ఎప్పుడు జరుపుకంటారో ఆ పండుగ వచినప్పుడు చెప్తాకానీ ఇప్పుడు
స్వాతంత్ర్య దినోత్సవం గురించి తెలుసుకుందాం.
ఝాన్సీ : సరే ఐతే.చెప్పు వింటాను.
భరత్ : స్వాతంత్ర్య దినోత్సవం అంటే స్వాతంత్ర్యం పొందిన దినం నాడు జరుపుకునే ఉత్సవం , అంటే పండుగ
తల్లీ.మన దేశానికి 1947 వ సంవత్సరం ఆగష్టు 15 వ తారీకు అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చిందమ్మా....
ఝాన్సీ : అబ్బా....నాన్నా.....ఏంటి నువ్వు....అసలు స్వాతంత్ర్యం అంటే ఏంటి ?..ఎవర్నుండి దాన్ని పొందాం?
భరత్ : స్వాతంత్ర్యం అంటే మనపైన ఎవరి అజమాయిషీ లేకుండా..మన ఇష్టం వచ్చినట్టు బ్రతకడం .అది
మనం బ్రిటీషు వారి నుండి పొందాం.
ఝాన్సీ : అంటే అంతకు ముందు మన దేశం స్వతంత్రంగా లేదా? అంటే ఇప్పుడు అనుభవిస్తున్న స్వతంత్రం
మనకు లేదా? అంటే మనం అప్పుడు ఎలా ఉండేవాళ్ళం?.
భరత్ : బ్రిటీషు వాళ్లు రాకముందు ఎవరి రాజ్యాలు వారికి స్వతంత్రంగా ఉండేవి.అన్నీ కలిపి అఖండ భారతంగా
ఉండేది.వ్యాపారం కోసం అంటూ వచ్చీ మనని మన దేశాన్నీఆక్రమించుకున్నారు.బ్రిటీషు వాళ్లు
వచ్చాక మనం మన దేశంలోనే బానిసలుగా బ్రతకాల్సి వచ్చేది.వాళ్లు చెప్పినట్టు వినాల్సి వచ్చేది,
వాళ్లు మనని దోచుకునేవారు , చీదరించుకునేవారు, అసహ్యించుకునేవారు, అమ్మాయిలను
పాడుచేసేవారు ఎదురుతిరిగితే చంపేసేవారు.ఇంకా ఎన్నో చెడ్డ పనులు చేసేవా....ర...మ్మా......
ఝాన్సీ : ఏంటి?...నాన్నా...ఏడుస్తున్నావా??...నువ్వు ఏడిస్తే నాకు ఏడుపొస్తుంది.
భరత్ : అవును తల్లీ . అప్పటి పరిస్తితి ఒక్కసారిగా గుర్తొచ్చి ఏడుపొచ్చేసింది.మన తాత ముత్తాతలు కూడా ఈ
బాధలు అనుభవించినవారే.అందుకే నాకు భరత్ అనీ నీకు ఝాన్సీ అని తాత గారు పేరు పెట్టారు.దేశభక్తి అప్పట్లో చాల ఉండేది. ఇప్పటికీ మనలో కూడా ఉంది .కావాలంటే జనగణ పాడేటప్పుడు గమనించు మన చేతి వెంట్రుకలు నిక్కబొడుచుకోవడం చూస్తాం,ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది అలాగే పాకిస్తాన్ మ్యాచ్ ఆడితే దేశం మొత్తం టి.వి లకి అతుక్కుపోయి భారత్ గెలవాలని ప్రార్థనలు చేస్తాం.దీన్నే దేశభక్తి అంటాం.కానీ దేశభక్తిని కొన్నిసార్లు చూయించుకోవాలి తల్లీ..అలా అయినా కొందరు ద్రోహులు మారతారు మన దేశం లో.
ఝాన్సీ :సరే బాధపడకు...నాన్నా....మరి మన వాళ్లు ఎవ్వరూ వాళ్ళతో ఫైట్ చెయ్యలేదా?.
భరత్ : అలా వాళ్లు ఫైట్ చేసి పెట్టారు కాబట్టే మనం ఈ రోజు ఇంత ఆనందంగా ఉన్నాం.అంతే కాదు అప్పుడు
దేశం కోసం జైళ్ళకు వెళ్లేవాల్లు, ఇప్పుడేమో అదే దేశాన్నీ దోచుకుంటూ.ఆ దేశ జనాల్ని హింసిస్తూ
మన వాళ్ళే జైల్లకి వెళ్తున్నారు.ఖర్మ ఎం చేస్తాం తల్లీ..
ఝాన్సీ : పోనీలే నాన్నా...జైళ్లలోవాళ్లని బాగా తంతారు...స్వాతంత్రం స్టొరీ చెప్పు నాన్నా...
భరత్ : అప్పట్లో చాలా మంది స్వాతంత్ర్యం కోసం ఫైట్ చెయ్యడమే కాకుండా ప్రాణాలు కూడా
కోల్పోయరమ్మా....
ఝాన్సీ : హమ్మో!........అవునా నాన్నా!...అయితే అలా దేశం కోసం బ్రతికిన వాళ్లలో కొందరి పేర్లు చెప్పు నాన్నా.....
భరత్ : ఆ రోజుల్లో అందరూ దేశం కోసం బ్రతికేవారు తల్లీ..కేవలం దేశం కోసమే బ్రతికే వారు.....వాళ్ళలో కొందరి పేర్లు చెప్తా విను..ఝాన్సీ లక్ష్మిభాయి (నీ పేరు అదే పెట్టాం), సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, లాలా లజపతిరాయ్ , బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, సర్దార్ వల్లభాయి పటేల్, వినోభాభావే, సుర్యసేన్, రాణి గ్లైనిదిన్, సావర్కర్, అల్లూరి సీతారామరాజు, ఖడ్గ బ్రాహ్మణ, అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి, రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణ, జయప్రకాశ్ నారాయణ్, వాసుదేవ్ భలవంత్ ఫాడ్కె, సరోజినీ నాయుడు, కందుకూరి వీరేశలింగం, ప్రకాశం పంతులు, మౌలానా అబుల కలాం ఆజాద్, బాబ్రుద్దీన్ త్యాబ్జీ , బంకించంద్ర చట్టర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్, దాదాబాయి నౌరోజీ, నెహ్రూ...ఇంకా ఎంతో మంది హీరోల త్యాగ ఫలం మనం ఇప్పుడు రుచి చూస్తున్నాం.
ఝాన్సీ : వాళ్లు హీరోల???...మరి టి.వి లో రోజు చూపించే హీరో హీరోయిన్లు ఎవరు మరి?
భరత్ :నువ్వడిగే హీరోలు హీరోఇన్లు టాలీవుడ్ హీరో, బాల్లీవుడ్ హీరో, హాల్లీవుడ్ హీరో, కోలీవుడ్ హీరో అంటూ హీరోయిన్లు అంటూ వేరే పేర్లు చెప్తారు అనుకుంటున్నావనుకుంటా..కదా...ఆ పేర్లు ....యన్.టి.ఆర్ , చిరంజీవి , రజినీకాంత్ , అమితాబ్ బచ్చన్ , మమ్ముట్టి , మోహన్ లాల్, , అనుష్క, ఇలియానా, త్రిష, ఐశ్వర్య రాయ్, ఇలాంటి పేర్లు విన్టావ్ కదా..
ఝాన్సీ : అవును నాన్నా....
భరత్ : వాళ్లు రియల్ హీరోలు కాదమ్మా...వాళ్లు సినిమా హీరోలు ..అంతే...అవన్నీ నాటకాలు మాత్రమే...నేను చెప్పిన వారే రియల్ హీరోలు....వాలది నిజమైన హీరోయిజం.
ఝాన్సీ : సరే.... అయితే దేశం కోసం పోరాడిన వాళ్ళే నా ఫేవరేట్ హీరో హీరోయిన్లు..నాన్నా...
భరత్ : నీకే కాదమ్మా....వాళ్లు అందరికి ఫేవరేట్ హీరో హీరోయిన్లే.
ఝాన్సీ : అయితే వాళ్ల త్యాగానికి గుర్తు చేసుకుంటూ మనం దేశానికి ఏమి ఇవ్వాలి నాన్న....??
భరత్ : దేశానికి ఏమి ఇవ్వక్కర్లేదు తల్లీ ....ఎవరి బ్రతుకులు వాళ్లు....నిజాయితీగా....నిస్వార్థంగా బ్రతుకుతూ....ఎవరినీ దోచుకోకుండా, ఎవరినీ బాధపెట్టకుండా , నేరాలు చెయ్యకుండా, ప్రభుత్వ ధనం మింగకుండా, ఓటు వేసేటప్పుడు నిజాయితీగా ఉంటూ, అందరితో కలిసి మెలిసి ఉంటె దేశం అదే బాగుపడుతుంది.
ఝాన్సీ: అంటే దేశానికి ఏమి చెయ్యాల్సిన అవసరమా లేదంటావా నాన్నా.??
భరత్ : చిట్టి తల్లీ........ దేశమంటే ఏంటి???..దేశంలో ఉండేవాల్లెవరు??
ఝాన్సీ : దేశం అంటే మనుషులు....దేశంలో ఉండేది కూడా మనుషులు..
భరత్: అంటే.... ఒక్కొక్క మనిషి కలిస్తే దేశం అవుతుంది కదా....అలా....ఎవరికి వారు ఎదుగుతే దేశం ఎదుగుతుంది కదా....సో నువ్వు దేశానికి ఏమి చెయ్యకు..నీ అంతకు నువ్వు ఎదుగు...అలా నువ్వు ఎదగాలని నీకు నువ్వు చెప్పుకోవడమే..దేశానికి నువ్వు ఇచ్చే పెద్ద బహుమతి..
ఝాన్సీ : అలాగే నాన్నా....మనకు ఎలా స్వాతంత్రం వచ్చిందో, ఎవరి వల్ల వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో చెబుతా.....అలాగే ఎవరికీ వారు ఎదగడమే దేశానికి మనం ఇచ్చే బహుమతి అని కూడా చెబుతా....ముందుగా నీకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు నాన్నా...గుడ్ నైట్...
భరత్: నీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చిట్టితల్లీ..అంతే కాదు ఈ జెండా పండుగలు సెలవు దినాలు కాదని, మిఠాయి పంచుకోవడం కాదనీ, ప్రతి రోజు వాల్ల త్యాగాని గుర్తుపెట్టుకోవాలనీ, ఇచ్చిన స్వాతంత్రాన్ని చెడుకి ఉపయోగించరాదనీ అందరికి నీ మాటగా చెప్పు...చివరగా చెప్పేది......మన జీవితం లో ఎదగడమే మన దేశానికి మనం చేసే నిస్వార్థమయిన దేశ సేవ తల్లీ.....
i wish you happy independence day to all INDIANs

జై హింద్

No comments:

Post a Comment