Saturday, 19 March 2016

Always Be Positive






"నేడు సమాజంలో ప్రతి చిన్న విషయానికి, ప్రతి చిన్న కష్టానికి అందరికీ కనిపించే సమాధానం ఒక్కటే అదే ఆత్మహత్య.....ఆత్మహత్య........ఇలా అందరూ పిరికితనంతో జీవిత సమరంలో గెలవలేక కాదు ....గెలవలేము అని భ్రమించుకొని తమ అపూర్వ మేధస్సును ఎవ్వరికీ ఉపయోగపడకుండా నాశనం చేసుకుంటున్నారు .ఇలాంటి ఆత్మహత్యలను ఆపి దేశ భవిష్యత్తుకు పటిష్టమయిన పునాది వేసి , దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి మా ఈ చిన్న ప్రయత్నం. " మనం ప్రతిరోజు దినపత్రిక (paper) చదివేటప్పుడు ( కనీసం 2 లేదా అంతకంటే ఎక్కువ ) అందులో చదివే విచారకరమయిన వార్తల్లో 99% ఆత్మహత్యలకు సంబంధించినవే ..ఎందుకు ఆ వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం వచ్చింది? వారికి వచ్చిన ఆ కష్టమేంటి? ఆత్మహత్య చేసుకోవల్సినంతగా వారు జీవితంలో పోగొట్టుకున్నది ఏమిటి? మనకు అలాంటి పరిస్థితి వస్తుందా ? వస్తే దాన్ని ఎదుర్కోవాలా? లేదా అందరిలాగా ఆత్మహత్య చేసుకోవాలా? ఎదుర్కొనాలంటే అది ఎలా???నేడు సమాజంలో పోటీతత్వం పెరిగింది .ఆ పోటీతత్వాన్ని ఎదుర్కోవడానికి ప్రతీ మానవుడు ఎన్నో ఒడిదుడుకులను , మరెన్నో కష్ట -నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ."ప్రపంచీకరణ (Globalization) వైపు దూసుకెళ్తున్న ఆధునిక సమాజంలో " ఇంకా ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? నేను పంట నష్టపోయానని రైతన్న, తల్లిదండ్రులు తిట్టారని బిడ్డలు, పరీక్షల్లో తప్పామని విద్యార్థులు, భర్త కొట్టాడని భార్యలు, భార్య మాట వినలేదని భర్త, ఎంజాయ్ చేయటానికి డబ్బులు ఇవ్వలేదని, ఆరోగ్యం బాగాలేదని , చివరకు ప్రేమ విఫలమయ్యిందని ప్రేమికులు, స్నేహితులు హేళన చేసారని, అందంగా లేనని,నిరుద్యగంతో ....ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలున్నాయి .....కాని కష్టం ఉన్న ప్రతిచోటా సుఖం మనకై ఎదురుచూస్తూ ఉంటుంది. పంట నష్టపోతే ఏమౌతుంది. మరొకసారి లాభం పొందవచ్చు, మన జన్మ తల్లిదండ్రులు పెట్టిన భిక్ష..వారే లేకపోతే మనం ఉండేవాల్లమా?..భవిష్యత్తులో మనం కూడా అదే స్థితిలో (తల్లి/ తండ్రి) ఉంటాము.అప్పుడు ఏదో ఒక కోపంతో వారిని తిట్టమా? కొట్టమా? ఒకసారి ఆలోచించండి! అయినా వారు కష్టపడేది ఎవరికోసం? వారి ఆస్తిపాస్తులు ఎవరికోసం? వారి బిడ్డల కోసమే కదా! అలాంటి parents తిడితే/కొడితే ఆత్మహత్య చేసుకోవాలా?వారికి ఆ హక్కు లేదా? అయితే భవిష్యత్తులో మనకి కూడా ఆ ఆ హక్కు లేనట్టే . "తల్లిదండ్రులారా మీకూ మా చిన్న విన్నపం ....మీ పిల్లల కోసం మీరు సమయం కేటాయించి మంచి, చెడు చెప్పండి.ఫెయిలయితే వారికి ధైర్యం చెప్పండి.. ... అలా చేస్తే మీపై వారికి గౌరవంతో కూడిన ఇష్టం పుడుతుంది...అప్పుడు మాత్రమే మీది ఆప్యాయమైన బంధం అవుతుంది...పిల్లలూ మీరు కూడా తల్లిదండ్రుల భావోద్వేగాలను అర్థం చేసుకోండి.వారు కోపంలో చావండి అని తిట్టినంత మాత్రాన దయచేసి ఆ విషయాన్ని తప్పుగా అర్థంచేసుకోవద్దు". పరీక్షల్లో తప్పితే మళ్లీ పరీక్షలు రాయనివ్వరా?. ఇక్కడ అందరికీ వచ్చిపడే చిక్కేంటంటే ఫెయిలయితే ఇంట్లో తిడతారేమో? స్నేహితులు హేళన చేస్తారేమో? అందరూ తక్కువ చూపు చూస్తారేమో? ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఫెయిలవ్వడం లేదా? మీరు మాత్రమె ఫెయిలయ్యరా? ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసందర్భంలో నైనాఫెయిలయినవారే! "అసలు ఓటమే తెలియని విజేత ఎవరైనా ఉన్నారా??....ఖచ్చితంగా ఉండరు"...కష్టమొచ్చిన ప్రతి వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఎలా? సృష్టిలో అత్యున్నతమైన మానవ జన్మ పొంది ఏమి సాధించకుండా చస్తే నీ జన్మకు సార్థకత ఏది మిత్రమా.......మనకంటే జంతువులే నయం, అవి ఏ కష్టమొచ్చినా సరే వాటికి చేతకాకపోయినా అవి ఎదురుతిరిగి పోరాడతాయి, కాని ఆత్మహత్య చేసుకోవు ......భూమిపై ఎంతమంది తల్లిదంద్రిలేని అనాధలుగా బ్రతుకుతున్నారు, వాళ్లకి లేని బాధలు కష్టాలూ మీకెక్కడివి.....మరి అనాధలకున్నంత ధైర్యం మనకెందుకు లేదు?. మనం పిరికివాల్లామా అంటే అది కూడా కాదే....మనం చాలా ధైర్యవంతులం ఆ విషయం మనకు కూడా తెలుసు.మరి ఎందుకు ఆత్మహత్య చేసుకోవడం? కేవలం మానసికంగా క్రుంగిపోతునపుడు మాత్రమే ఆ ఆలోచన వస్తుంది .మరి ఎందుకు మానసికంగా క్రుంగిపోతున్నారు.మీరు మానసికంగా క్రుంగిపోవడానికి గల కారణాన్ని ఆలోచించండి .ఈ ప్రపంచంలో పరిష్కారంలేని సమస్యలంటూ ఏమి లేవు...ఆలోచిస్తే పక్కాగా మీ సమస్యను మీరు ధైర్యంగా ఎదుర్కోగలరు. దయచేసి మీ సమస్యకు పరిష్కారం లేదని అనుకోవద్దు .ఒక్కసారి మీకు సన్నిహితులైన వారితో మీ సమస్యను చెప్పండి.ఖచ్చితంగా మీ మనసులోని భారం తగ్గుతుంది.క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కేవలం మన జీవితాన్నే కాకుండా మన చుట్టూ ఉండే, మనపై ఆధారపడే వారిపై కూడా చాలా ప్రభావాన్ని చూపుతాయి.మీరు ఆత్మహత్య చేసుకునేటప్పుడు ఒక్క క్షణం ఇది అవసరమా అని ఆలోచించండి.చాలాసార్లు సమాధానం ఔననే వస్తుంది..కాని మీ గురించి మాత్రమే కాకుండా ఒక్కసారి మీ కుటుంబం గురించి ఆలోచించండి.మిమ్మల్నే నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ళ గురించి ఆలోచించండి. మీరు ఎంత పొరపాటు చేస్తున్నారో అర్థమవుతుంది…. “మీరు ఇదంతా చదివిన తరువాత మేము ధైర్యవంతులమే కదా ...మాకెందుకు దీని అవసరం అనుకోవచ్చు? కానీ మీరు, కనీసం మీప్రక్కన ఉన్న వారినైనా ఇలాంటి ఆలోచనల నుండి కాపాడగలరనే ఈ ప్రయత్నం....” Note: Please don’t commit suicide for any movement........jai hind Please come and join with us and share your views…suggestions……https://www.facebook.com/groups/184475304940284/ http://www.orkut.co.in/Main#Community?cmm=48651716

మీరు కానీ, మీకు తెలిసిన వారు కానీ ఎవరైనా సమస్యలతో బాధపడుతుంటే దయచేసి క్రింది నెంబర్ ను సంప్రదించండి.... Roshini Foundation: 040-66202000 Sarvejana Sankshema mandali: 040-20054456, 9346616491 Makro foundation : 040-4600 4600

No comments:

Post a Comment