నన్ను సృష్టించిన ఆ దేవుడి ప్రతిమ కనిపించినా , నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు తారసపడినా (నేననేది కనిపించిన ప్రతిసారీ),
దగ్గరికి రాని నా కరములు మిమ్మల్ని చూడగానే “నమస్కారం’ అంటూ తమ సంస్కారం చాటుకుంటాయి.
మిమ్మల్ని చూడగానే
“మా విద్యార్థి జీవితం మొత్తం గిర్రున కళ్ల ముందు అలా మెదలాడుతుంది,
మేము విద్యాలయాల్లో చేసిన చిలిపి పనులు గుర్తొస్తాయి,
మీరు చెప్పిన నీతి మాటలు అలా చెవుల్లో మార్మోగుతాయి,
మేము తప్పు చేసినప్పుడు, మేము ఏమైపోతామో అని బాధ్యతతో మీరు పెట్టిన ఛీవాట్లు గుర్తొస్తాయి,
మాపైన ఎంతో ప్రేమ ఉండీ, మా భవిత కోసం మమ్మల్ని దండించిన క్షణాలు గుర్తొస్తాయి,
పరీక్షల్లో తప్పితే మా వెన్ను తట్టిన క్షణాలు గుర్తొస్తాయి,
మంచి మార్కులు వచ్చినా కూడా ఎక్కువగా పొగడని మీ ముందుచూపు ఇప్పుడు గుర్తెరుగుతున్నాము,
కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మార్కులవే వస్తాయనే మీ మాటలు గుర్తొస్తాయి,
చదువుకన్నా సంస్కారం ముఖ్యమన్న మీ హెచ్చరికలు గుర్తొస్తాయి,
పుస్తకాలలోని పాఠాల కన్నా జీవితంలో ఉపయోగపడే పాఠాలు నేర్పిన మీ ప్రేమ గుర్తొస్తుంది,
మేము స్థిరపడ్డాము మాష్టారు, అని చెప్పగానే మీ కళ్లల్లో కనిపించే ఆ “గర్వం” నోబెల్ ముందు దిగదుడుపే అనిపిస్తుంది,
ఇంతా చేసి మీరు, మా నుండి ఆశించేది ఏదైనా ఉందా అంటే ......
అది మా “ఎదుగదలే”........
.
మీకు ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేను .....
అందుకే,
మీరు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ మీకు ఇవే మా పాదాభివందనాలు.....
గమనిక: దేశ భవిషత్తు మీ చేతిలో ఉంది, దాన్ని కాపాడతారని ప్రతి గురువుని వేడుకుంటూ........గురువులంద రికీ
“గురు పూజోత్సవ శుభాకాంక్షలు”

గమనిక: దేశ భవిషత్తు మీ చేతిలో ఉంది, దాన్ని కాపాడతారని ప్రతి గురువుని వేడుకుంటూ........గురువులంద
“గురు పూజోత్సవ శుభాకాంక్షలు”

No comments:
Post a Comment