Saturday, 19 March 2016

కలాం గారికి నివాళితో......స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.....

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు




ఝాన్సీ : హాయ్... నాన్నా.....

భరత్ : హెల్లో....... చిట్టితల్లి..... 

ఝాన్సీ : ఏం చేస్తున్నావు నాన్నా?.....

భరత్ : ఆఫీసులో కొంచం మిగిన పోయిన పని కొంచం ఉంది , ఆ పని చేసుకుంటున్నా.......ఏ?

ఝాన్సీ :నాన్నా.. నీ మొబైల్ ఫోన్ ఒకసారి ఇస్తావా?.....

భరత్ :ఇదిగో తీసుకో, ఏంటి గేమ్స్ ఆడుకుంటావా?

ఝాన్సీ : లేదు నాన్నా, నీ మెసేజెస్ చూస్తా....

భరత్ :మెసేజెస్ ఆ!!!!!.....ఎందుకు?

ఝాన్సీ : ఏమీ... లేదు, రేపు స్వాతంత్ర్య దినోత్సవం కదా, నీకు ఎన్ని స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు వచ్చాయో చూద్దాం అని...

భరత్ : గుడ్.....చూడు, నాకూ చెప్పు లెక్కపేట్టి ఎన్ని మెసేజెస్ వచ్చాయో? అయినా ఎందుకు అలా లెక్క పెట్టాలనిపించింది?

ఝాన్సీ : ఏం లేదు, నాన్నా న్యూ ఇయర్ కి అడ్వాన్సు గా ఎన్నో విషేస్ వస్తాయి, అలాగే చాలా పండగలకి ఎంతోమందికి విషెస్ పంపిస్తారు, కానీ మన జాతీయ పండగలకు అందరు ఎందుకు అలా పంపరు? దేశం అంటే మనలో ప్రేమ లేదా...?

భరత్ :అందరూ అలా ఉండకపోవచ్చు, భారతీయుల్లో చాలా మందికి మనదేశమన్నా, మన ప్రజలన్నా, చచ్చేంత ప్రేమ... కాదు... కాదు...చచ్చేంత పిచ్చి.....

ఝాన్సీ : మరి అలాగైతే విషెస్ ఎందుకు చెప్పుకోరు, నేననేది, అన్ని పండగలకీ , న్యూ ఇయర్ కీ , ఇచ్చినంత ఇంపార్టెన్స్ వీటికి ఎందుకు ఇవ్వట్లేదు?....నాన్నా??

భరత్ :హమ్మ! ఝాన్సీ ఎంత పెద్దగా ఆలోచిస్తున్నావు, నిన్ను చూసి గర్వంగా ఉంది నాకు, అలా అని ఏమి లేదు తల్లీ, భారతీయులందరు భారతీయులమని చెప్పుకోడానికి ఎప్పుడూ గర్వపడతారు, కాని విషెస్ విషయానికి వచ్చేసరికి?

ఝాన్సీ : అదే విషెస్ ఎందుకు చెప్పుకోరు ?
భరత్ : ఏదైనా ఒక వస్తువు మన దగ్గర ఉన్నంతకాలం దాని విలువ తెలియదు, విలువ తెలిసిన వాడు దాన్ని ఎప్పుడూ మర్చిపోడు, చులకన చేయడు కూడా...

ఝాన్సీ : అమ్మో! నాన్నా... కొంచం అర్థం అయ్యేలా చెప్పు....నాన్నా......

భరత్ :మన తాతయ్య స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు కదా! వారు ఎప్పుడూ చెప్పేవారు బ్రిటీష్ కాలం నాటి భయంకరమైన పరిస్థితులు, అప్పట్లో వాళ్ళకు స్వాతంత్ర్యం లేదు, దాన్ని ఎలాగైనా పొందాలని వాళ్ళు తహతహ లాడేవాళ్లు, తాపత్రయ పడే వాళ్లు, దేశం కోసం ప్రాణాలు సహితం అర్పించే వాళ్లు. అదే మరి ఇప్పుడో!!.......

ఝాన్సీ :మరి, ఇప్పుడు ఏమైంది నాన్నా!?

భరత్ : ఇప్పుడు మనకు స్వాతంత్ర్యం కావలసినంత ఉంది, అందుకే దాని విలువ చాలా మందికి తెలియటం లేదు.

ఝాన్సీ : ఏంటి నాన్నా? నీ ఒపీనియన్, విషెస్ చెప్పని వాళ్ళందరికీ స్వాతంత్ర్యం విలువ తెలియదనా?

భరత్ : అలా అని కాదు కానీ , దాదాపుగా దాని విలువ చాలామందికి తెలియదు, అందుకే అడ్వాన్సు విషెస్ కానీ విషెస్ కానీ చాలా తక్కువ మంది పంపిస్తారు.

ఝాన్సీ : ఏంటి నాన్నా! ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచించమనే నువ్వు, నెగటివ్ గా మాట్లాడుతున్నావు అనిపిస్తుంది.

భరత్ :ఇది నెగటివ్ భావాలు కాదమ్మా, బాధతో వచ్చిన భావాలు. మన దేశం లో దేశ బక్తి కన్నా దైవ భక్తే ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది.

ఝాన్సీ : దేశ భక్తి? దైవ భక్తా? ఏంటి తేడా?.....కన్ఫ్యూజ్ చెయ్యకు నాన్నా.....వాటిలో ఏది గొప్ప?... ప్లీజ్ నాన్నా ఇంకొంచం అర్థం అయేలా చెప్పు..... నాన్నా.......

భరత్ :హిందువుల పండగలకి గుళ్లు, ముస్లింల పండగలకి మసీదులు, క్రిస్టియన్ల పండగలకి చర్చీలు, సిక్కుల పండగలకి గురుద్వారాలు, ఇంకా వేరే మతస్తుల మందిరాలు ఎప్పుడైనా గమనించావా?

ఝాన్సీ : హా... గమనించా.... కాని ఎందుకు?

భరత్ : ఆ పండగ దినాల్లో , ఆ ఆ దైవ మందిరాల్లో జనం ఎంత ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటూ, ఒకరిని ఒకరు పలకరించుకుంటూ, ఎంతో ఆనందంగా ఉంటారు. మరి జాతీయ పండగలకి అలా ఉండటం ఎప్పుడైనా....ఎక్కడైనా చూసావా?

ఝాన్సీ : హా..ఎందుకు చూడలేదు.... చూసా, మా స్కూల్లో వేరే స్కూల్లో చూసా, అంతే కాదు, స్కూల్ కి వెళ్తుంటే కొన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా చూసా.

భరత్ : హా.... ఝాన్సీ వాటిల్లో కూడా ఆ హడావిడి కొన్ని గంటల పాటే ఉంటుంది. కాని రోజంతా పండగ వాతావరణం ఉండదు.

ఝాన్సీ : అంటే దేశ భక్తి, దైవ భక్తి కంటే గొప్పది అంటావా?

భరత్ : ఇక్కడ ఏది గొప్ప అన్నది మ్యాట్టర్ కాదు. దేశ సేవ ప్రజలకు సేవ చేస్తే అది దైవ భక్తి తో సమానం, అందుకే పెద్దలు “మనవ సేవే మాధవ సేవ అన్నారు”. దేశం కోసం బ్రతకాలి, దేశం గర్వించేలా బ్రతకాలి.

ఝాన్సీ : అంటే ఎలా బ్రతకాలి నాన్నా?

భరత్ :ఎలా బ్రతకాలా........ మన అబ్దుల్ కలాం గారిలా బ్రతకాలి.

ఝాన్సీ : హా...... నాన్నా..... నాకు కూడా, కలాం తాత గారంటే అంటే చాలా ఇష్టం. ఈ మధ్యే చనిపోయారు కదా నాన్నా?

భరత్ : అవునమ్మా, ఒక గొప్ప వ్యక్తిత్వం గల గొప్ప వ్యక్తిని మన దేశం కోల్పోయింది.

ఝాన్సీ : అవును, నాన్నా, మీరు నాకు ఆయన మాటలు ఎప్పుడూ చెప్తుండేవారు.

భరత్ : కలాం గారు, ఎప్పుడూ, దేశాన్ని ప్రేమిస్తూ, దేశ ప్రజల్లో స్పూర్థిని నింపుతూ, తన జీవితాన్ని దేశ సేవ కే అంకితం చేసారు. ప్రతి వ్యక్తి కలాం గారిలాగా నిస్వార్ధంగా, నిజాయితీగా బ్రతకాలి.ఆయన చెప్పిన మాటలు కొన్ని గుర్తు చేసుకుందాం....
కలలు కనాలి, వాటిని సాకారం చేసుకోడానికి కష్టపడాలి.
నిన్ను నువ్వు బెస్ట్ అనుకోవాలి, సాధించలేనిది ఏదీ లేదు అనుకోవాలి.
ఎన్ని ఓటములు ఎదురైనా విజయం కోసం ప్రయత్నం మానుకోకూడదు.
జీవితం – కాలం, ఈ రెండూ మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి, వాటిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.
విద్యార్థి అంటే ప్రశ్నిస్తూ ఉండాలి, లేకపోతే నిజమైన విద్య నేర్చుకోలేవు.
దేశాన్ని మార్చే సత్తా ఉంది ముగ్గురికే -> తల్లి, తండ్రి, గురువు.
అందరూ వెళ్లే దారిలో కాకుండా , కొత్త దారిలో వెళ్లు, విజయాన్ని పొందే వరకు ఆగకు.
ఆత్మవిశ్వాసం- కఠోరశ్రమ ఉంటే విజయం నీ దాసోహం అంటుంది.
కష్టాలు లేకపోతే విజయాన్ని ఆస్వాదించలేవు , విజయం కోసం కష్టాన్ని కూడా అస్వాదించు.
ఇలా ఎన్నో స్పూర్థి నింపే మాటలు మనకందించి కలాం గారు వెళ్లి పోయారు.....
ఆయన కలలు కన్నా విషన్ 2020 సాకారం అవ్వాలంటే ప్రతి ఒక్కరూ దేశం గురించి ఆలోచించాలి...
దేశం గురించి ఆలోచించకపోయినా , పర్వాలేదు కాని, మీ వల్ల దేశం నాశనం అవ్వకుండా చూసుకుంటే ఆ పెద్దాయన ఆత్మ శాంతిస్తుంది.......
“కలాం గారు, మీకు భారత జాతి సలాం”....ఝాన్సీ..... స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తల్లీ...ఇప్పటికే లేట్ అయ్యింది....మనదేశం గురించి ఇంకా చాలా విషయాలు చేప్తా....ఇప్పుడు వెళ్లి పడుకో...... గుడ్ నైట్ రా.....

ఝాన్సీ :నీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.......గుడ్ నైట్.....నాన్నా.....



జై హింద్.............

No comments:

Post a Comment