Saturday, 19 March 2016

నేనే గెలిచా............ఒక సెల్ ఫోన్ గాడి వీర గాథ.................

నేనే గెలిచా.............



నమస్తే బాస్ ......నా పేరు సెల్ ఫోన్ .. కొందరు ముద్దుగా మొబైల్ అని కూడా పిలుస్తుంటారు ..ఈ దేశంలో నేను పుట్టి కొన్ని సంవత్సరాలు అవుతుంది ......అప్పట్లో నేను చాలా లావుగా ,పెద్దగా వుండేవాన్ని.. కాని అది అందరికి నచ్చట్లేదు ...ఎంత సన్నబడితే అంతమంచిదని చూస్తున్నారు జనాలు ........అదే మా మహాభాగ్యం అన్నట్లు మా అమ్మా నాన్న (కంపెనీవారు ) కూడా కరీనాకపూర్ జీరోప్యాకులా నన్ను స్లిమ్ గా తయారు చేస్తున్నారు .....


నాలాంటి పిల్లల్ని తయారుచేయడానికి ఈ దేశంలో చాలా మంది అమ్మా నాన్న మార్కెట్లో పుట్టుకొచ్చారు. అలా మా మధ్యే తీవ్రపోటీ నెలకొంది ....వెధవ మనుషుల్లోనే అనుకునే ఈ పోటీ మాలోకి కూడా వచ్చి మమ్మల్ని నాశనం చేసింది ..అలా ప్రస్తుతం మా జనాభా లెక్క ప్రకారం మేము కోట్లలో ఉన్నాం ......మనుషుల్లో లాగా మాలోనూ మతాలు , కులాలు, ప్రాంతీయ భేదాలు వున్నాయి ..





ప్రాంతీయభేధాలు అంటే వేరే దేశంలో పుట్టిన కొన్నింటికి ఎక్కువ ధరనూ , కొన్ని దేశాల్లో పుట్టిన (చైనా) వాటికీ మరీ తక్కువ ధర ఉంది.... మతాలంటారా నోకియా మతం, ఎల్ జి మతం , సామ్సంగ్ మతం, మైక్రోమాక్స్ మతం......ఇంకా ఎన్నో మైనారిటీ వర్గాలు వున్నాయి ...నోకియా మతంలో కులాలున్నాయి, ఎల్ జి మతంలోనూ కులాలున్నాయి ........ఇలా అనేక కులాలు మా మధ్యలో పోటీ పడుతున్నాయి.......


నేను పుట్టకముందు ఈ పిచ్చి జనాల దగ్గర మా అన్నలైన టెలిగ్రాఫ్ గాడు, లాండులైన్ గాడూ మరియు అందరికన్నా చిన్నవాడు నా కన్నా పెద్దవాడు అయిన పేజర్ గాడు సేవలు అందించేవారు నేను పుట్టిన రోజుల్లో మా పెద్దన్నగాడు అయిన లాండ్ లైన్ గాడు నేను ఎక్కువ రోజులు బ్రతకనని, నన్ను మేపడానికి అయ్యే ఖర్చు జనాలు భరించలేరని నాతో అనేవాడు......కానీ నేనప్పుడు బాధపడలేదు ఎందుకంటే నాకు ఆ రోజు తెలుసు ఈ పిచ్చి జనాలు ఏదో ఒకరోజు నాకు బానిసలు అవుతారని....అందుకే నేను కాదు చచ్చేది నువ్వే (లాండ్ లైన్ ) చస్తావని ఛాలెంజ్ చేసా....



ఛాలెంజ్ అయితే చేసా కానీ మొదట్లో చాలా భయం వేసింది.......ఎందుకంటే అప్పట్లో నాకు ఎవరన్నా కాల్ చేసినా (ఇన్ కమింగ్ ) మా యజమాని డబ్బులు కట్టాల్సి వచ్చేది........తర్వాత ఇన్ కమింగ్ కి డబ్బులు కట్టక్కర్లేదని మా తాత ట్రాయ్ (TRAI-Telecom Regulatory Authority of India) చాటింపు వేశాడు..... అప్పుడు ఆ క్షణాన నేను ఛాలెంజ్ లో గెలుస్తానన్న నమ్మకం కలిగింది.... చాలా కాలం క్రితం నా ఔట్ గోయింగ్ చార్జెస్ కూడా చాలా ఎక్కువగా ఉండేవి....ఇప్పుడు అవికూడా తగ్గించారు......మా దాయాదులందరూ పోటిపడి మరీ ఔట్ గోయింగ్ చార్జెస్ తగ్గిస్తున్నారు.....ఇక ఎస్.ఏం.ఎస్ ఆఫర్లు చెప్పక్కర్లేదు.....ఈమధ్య మాతాత మళ్ళి సీన్ లోకి వచ్చి రోజుకి కనీసం 200ల మెస్సేజ్ ల పంపాలన్నాడు.....అలా నా ప్రభావం కొంచెం తగ్గిందనిపించనట్టున్నా.....అది ఎప్పటికి తగ్గదు.....ఈ మధ్య కాలంలో మా సేవలు మరీ విస్తరించి జనాల్లోకి వెళ్ళాయి.....ఇప్పుడు మేము టీవీ గానూ,ఆన్ లైన్ బాంక్ గానూ,ఐపాడ్ గానూ,కేమెరాగాను మారిపోయాము.....ఇవికాక ఎన్నో......ఎన్నో సదుపాయాలు మాలో వున్నాయి.....ఈ సదుపాయాలన్నింటికి కొందరు పిచ్చి జనాలు బానిసలయ్యారు........కావాలంటే బయటకెళ్ళి చూడండి......భార్య లేకుండా భర్త, భర్త లేకుండా భార్యా బయటకెల్తారేమో గానీ నేను లేకుండా బయటకెల్లరు.....పక్కనున్న వ్యక్తులని పట్టించుకోకుండా మా తోనే ( మొబైల్) చాలా చాలా బిజీగ ఉంటారు.....ఇంతగా నాకు బానిసలైన ఈ జనాల్ని చూస్తే నాకు కొంచెం బాధ, జాలి కలిగినప్పటికీ..........మా అన్నయ్యతో చేసిన ఛాలెంజ్ గెలిచినందుకు ఆనందంగా ఉంది....సో మనుషులు నాకు బానిసలయినట్టేనని ఒప్పుకుంటారనుకుంట....సో నేనే గెలిచా.......నేనే గెలిచా..........హ హ ............


జై హింద్

No comments:

Post a Comment