Saturday, 19 March 2016

అమ్మ

చూడడానికి రెండు అక్షరాల పదమే కావచ్చు. 

కానీ నావరకు ఆమే నా గతం, నా వర్తమానం, నా భవిష్యత్తు. ఇలా ఎందుకన్నానంటే తనతో గడిపిన ప్రతిక్షణం నా జీవితంలో మధురస్మృతులే.... ప్రస్తుతం గడుపుతున్న క్షణాలు భవిష్యత్తులో తీపి గుర్తులు కావచ్చు అనేది నిస్సందేహమైన సమాధానమే......


ఒక ఇంటికి ఇల్లాలు అయిన ప్రతి ఆడపిల్ల ఏదో ఒక రోజు తల్లి ఆయ్యే భాగ్యాన్ని పొందుతుంది.. ఆ అబల మాతృత్వాన్ని ఒక అదృష్టంగా భావిస్తుందే కానీ భారమనుకోదు. తన కడుపు పండిన క్షణం నుండి తన వారసుడు/ వారసురాలు క్షేమం కోసం పరితపిస్తూనే ఉంటుంది. ఆ నవమాసాలు తన రక్త మాంసాలనే ముద్దలుగా చేసి ఒక పండంటి బిడ్డకి జన్మనిస్తుంది. ఆ నవమాసాల బాధను ఓపికతో భరించడమే ఒక గొప్ప అనుకుంటే, అంతకన్నా హృదయ విదారకమై పురుటినొప్పులు భరిస్తూ కూడా (లోలోన ఆనందాన్ని అనుభవిస్తూ) మనకు జన్మనిస్తుంది.

మనిషి తట్టుకొనే 47 డెల్ ( డెల్ = బాధకు ప్రమాణం ) కంటే ఎక్కువ అయిన 57డెల్ బాధతో మనకు జన్మనిచ్చింది మొదలు తనువు చాలించే వరకు తన యొక్క యోగక్షేమాల కన్నా తన బిడ్డల యోగాక్షేమాలే ఆమెకు ముఖ్యం. తన పిల్లలు పాలు తాగుతూ చేసిన పంటిగాట్ల బాధలతో పాటుగా ఎన్నో బాధలు అనుభవిస్తూ కూడా తన పిల్లలు బాగుంటే చాలు అనుకొనే ఒక “మహానుభావురాలు’’ ప్రతీ తల్లి, ఇంతాచేసి ఆమె మన నుండి ఆశించేది ఏదీ ఉండదు. అది ఆ మహాతల్లి నిస్వార్థ ప్రేమకు నిదర్శనం.


అలా నిస్వార్థ ప్రేమకు నిదర్శనం అయిన ఆమెకు ఒక కోరిక ఉండడం సహజం. అదేంటంటే తను అంత కష్టపడి పెంచిన తన సంతానాన్ని సమాజం పొగడాలని ఆరాటపడుతుంది. కావున ప్రతి వ్యక్తి సమాజానికి ఉపయోగపడడంలో అమ్మ పాత్ర ఎంతో ఉంది. మంచి సమాజం ఏర్పడటానికి ఖచ్చితంగా మూలకారణం అమ్మే. అలాంటి గొప్ప వ్యక్తికి నిరంతరం సేవలు చేయకపోయినా పర్వాలేదు. కానీ వీల్లనెందుకు కన్నారా దేవుడా ...........అని ఆమె బాధ పడకుండా మన ప్రవర్తన ఉండేలా చూసుకోవడం మన లక్ష్యమూ...............కర్తవ్యమూ...............
జై హింద్

No comments:

Post a Comment