"దెయ్యాలేనయం"
అవును, అక్షరాలా మీరు చదివింది నిజమే అనిపించేలా పరిస్థితి ఉంది.....కావాలంటే నేను రాసింది చదవండి......ఇంతకు ముందున్న రోజుల్లో మనుషులకు దెయ్యాలంటే భయం...కానీ నేటి సమాజంలో ఆ దెయ్యాలే మానవుడ్ని చూసి భయపడే పరిస్థితి........
ఏంటి వీడు, దెయ్యం అంటూ........మానవుడు అంటూ......ఏవో పొంతన లేని మాటలు మాట్లాడుతున్నాడనుకుంటున్నా రు కదూ!! మీరే చెప్పండి ...మీ నిజజీవితంలో ఎప్పుడో ఒకప్పుడు దెయ్యం సంఘటనను వినే ఉంటారు....ఆ సంఘటనల్లో దెయ్యం తనకు చిన్న చిన్న కోరికలు వున్నాయి.....వాటి కోసం మిమ్మల్ని పీడుస్తుందని ఏ పనికిమాలిన భూతవైద్యుడో చెప్పి ఉంటాడు....
కానీ ఈరోజుల్లో మనుషుల కోరికలు ఎంతగా వున్నాయంటే యాభైరూపాయలకోసం ప్రాణం తీసేటంత, ప్రేమ అంగీకరించకపోతే యాసిడ్/కత్తి దాడి చేసేటంత, ఆస్తి కోసం కన్నవాల్లనే మట్టుపెట్టేటంత, అక్రమ సంబంధాల కోసం పిల్లల్ని తెగనరికేటంత, మూఢనమ్మకాలతో వందలమంది పిల్లల్ని బలి ఇచ్చేటంత, ఉన్మాదంతో అబలలని పాశవికంగా పాడుచేసేటంత.........ఇలా చెప్పుకుంటూ పోతే నా పేజీలన్నీ అయిపోయినా తీరని తీవ్ర కోరికల లిస్టు నేటి మానవుడి మనస్సు అనే జేబులో వుంది....
ఇప్పుడు చెప్పండి దెయ్యాలు నయమంటారా?? మానవుడు నయమంటారా????.....నా మటుకు మాత్రం దెయ్యాలే నయం అంటాను....ఇక దెయ్యాల విషయానికొస్తే పాపం వాటికి ఈ మధ్య అంత గిరాకీ లేదు లెండి....ఎందుకంటే అవి మానవుడి వికృతచేష్టలకు భయపడిపోతున్నాయి......అంతే కాదు ఏవో చిన్న చిన్న కోర్కెలతో తమ దెయ్యాల వంశాన్ని నెట్టుకొస్తున్నాయి....కానీ ఇప్పుడున్న మానవుడు తన తీరని తీవ్ర కోరికలతో చనిపోయిన తర్వాత తమ దెయ్యాల వంశంలో చేరి తమ వంశ గౌరవాన్ని ఎక్కడ నాశనం చేస్తాడో అని భయపడుతున్నాయి.....పాపం మనిషిని చూసి దెయ్యాలు భయపడుతున్నాయి.........సో ఫ్రెండ్స్ ఆ దెయ్యాలు కూడా అసహ్యించుకునే బ్రతుకు..........బ్రతకాలో వద్దో నిర్ణయం మీకే వదిలేస్తున్నా.........
జై హింద్
అవును, అక్షరాలా మీరు చదివింది నిజమే అనిపించేలా పరిస్థితి ఉంది.....కావాలంటే నేను రాసింది చదవండి......ఇంతకు ముందున్న రోజుల్లో మనుషులకు దెయ్యాలంటే భయం...కానీ నేటి సమాజంలో ఆ దెయ్యాలే మానవుడ్ని చూసి భయపడే పరిస్థితి........
ఏంటి వీడు, దెయ్యం అంటూ........మానవుడు అంటూ......ఏవో పొంతన లేని మాటలు మాట్లాడుతున్నాడనుకుంటున్నా
కానీ ఈరోజుల్లో మనుషుల కోరికలు ఎంతగా వున్నాయంటే యాభైరూపాయలకోసం ప్రాణం తీసేటంత, ప్రేమ అంగీకరించకపోతే యాసిడ్/కత్తి దాడి చేసేటంత, ఆస్తి కోసం కన్నవాల్లనే మట్టుపెట్టేటంత, అక్రమ సంబంధాల కోసం పిల్లల్ని తెగనరికేటంత, మూఢనమ్మకాలతో వందలమంది పిల్లల్ని బలి ఇచ్చేటంత, ఉన్మాదంతో అబలలని పాశవికంగా పాడుచేసేటంత.........ఇలా చెప్పుకుంటూ పోతే నా పేజీలన్నీ అయిపోయినా తీరని తీవ్ర కోరికల లిస్టు నేటి మానవుడి మనస్సు అనే జేబులో వుంది....
ఇప్పుడు చెప్పండి దెయ్యాలు నయమంటారా?? మానవుడు నయమంటారా????.....నా మటుకు మాత్రం దెయ్యాలే నయం అంటాను....ఇక దెయ్యాల విషయానికొస్తే పాపం వాటికి ఈ మధ్య అంత గిరాకీ లేదు లెండి....ఎందుకంటే అవి మానవుడి వికృతచేష్టలకు భయపడిపోతున్నాయి......అంతే కాదు ఏవో చిన్న చిన్న కోర్కెలతో తమ దెయ్యాల వంశాన్ని నెట్టుకొస్తున్నాయి....కానీ
జై హింద్

No comments:
Post a Comment