Saturday, 19 March 2016

"సమాచారహక్కు చట్టం-సామాన్యుడి పాశుపతాస్త్రం "

"సమాచారహక్కు చట్టం-సామాన్యుడి పాశుపతాస్త్రం "

భారతరాజ్యాంగం కొన్ని సంవత్సరాల క్రితం షష్టిపూర్తిచేసుకొని తన దిగ్విజయ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంది..... అలాంటి ప్రయాణంలోనే ఎనిమిది సంవత్సరాల క్రితం మొదటి యు.పి.ఏ ప్రభుత్వం భారతదేశ ప్రజలకు అందించిన కానుకే ఈ సమాచారహక్కు చట్టం..... ఈ సమాచారహక్కు చట్టం ద్వారా కేవలం పది రూపాయల (కొన్ని వర్గాలకు ఈ రుసుం కూడా మినహాయింపు) చెల్లింపుచే భారతదేశ ప్రభుత్వం యొక్క దాదాపు అన్ని శాఖలకు సంబంధించిన ఏదేని సమాచారాన్ని భారత పౌరుడు పొందవచ్చు.....


                        భారతపౌరుడి యొక్క చేతిలోని పాశుపతాస్త్రం ఈ సమాచారహక్కుచట్టం.......సమాచారాన్ని అందించే విధి నిర్వహణ చూడాల్సింది కేంద్రం లో కేంద్ర సమాచార కమీషన్,,, రాష్ట్రంలో రాష్ట్ర సమాచార కమీషన్,,, ఈ చట్టం ద్వారా దేశ ప్రజలు గ్రామస్థాయి నుండి మొదలుకొని దేశంలో ఏ సమాచారాన్నయినా తెలుసుకోవచ్చు...ఉదాహరణకు .....మీ గ్రామంలో రోడ్లు ఎంత ఖర్చుతో వేసారు, లిట్లు వెన్ని రోజులకోకసార్ వేసారు, డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు ఆలస్యం అవుతుంది, పాస్స్ పోర్ట్ రావడానికి సరిగ్గా ఎన్ని రోజులు పడుతుంది, ఎం.ఎల్.ఎ గత ఎన్ని రోజులగా నియోకవర్గానికి ఏమి చేసారు –ఎంతెంత ఖర్చయ్యింది, మంత్రుల విదేశీ పర్యటనల ఖర్చెంత, ప్రభుత్వం వివిధ పథకాలకు ఖర్చు చేసిన మొత్తం ఎంత.........ఇటీవల ఒక నిర్ణయం ప్రకారం రాజకీయ పార్టీలు వాటి ఖర్చులని బయట పెట్టాలని- ఆ ఖర్చులని కూడా సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవచ్చని సమాచార కమిషన్ తెలిపింది......దీనికి కొన్ని రాజకీయ పార్టీలు సుముఖంగా,కొన్ని రాజకీయ పార్టీలు విముఖత ప్రదర్శించాయి......దేశం లో కొన్ని భద్రతా పరమైన వాటి గురించి తప్ప మిగితా అన్ని విషయాలు ప్రజలకి తెలపాలి....ఇలా ప్రభుత్వ సమాచారం ఏదయినా మనం అడిగి తెలుసుకోవచ్చు....కాబట్టి ఎంతటి అవినీతి అయినా బట్టబయలు చేసే అవకాశం ఈ చట్టం ద్వారా కల్పించబడింది....కానీ ఈ అవినీతిని బట్టబయలు చేసిన కారణాన ఎంతోమంది నిజాయితీపరులు తమ ప్రాణాలు కోల్పోయారు......


                 ఈ దేశంలో అన్యాయాల్ని ప్రశ్నించేవారికి మరణమే బహుమానంగా దక్కుతుంది.....వాస్తవాలను వెలికితియాలనే లక్ష్యంతో పనిచేసే నిజాయితిపరుల నొసట అరాచకశక్తులు మృత్యు శాసనాన్ని లిఖిస్తున్నాయి.....అవినీతిపరుల భరతం పట్టాల్సిన సమాచారహక్కు చట్టం.......అడిగినవారి పాలిటే మారణాయుధంగా మారుతోంది.....అవినీతిని ఎదిరించిన నేరానికి గత ఏడాది కాలంలో దాదాపు 15 మంది అశువులు బాయడమే ఇందుకు నిదర్శనం!.......దీనికి సోదాహరణంగా 2003 నవంబర్ 13న ప్రి ప్లాండ్ మర్డర్ లో మరణించిన సత్యేంద్ర దూబే (బీహార్),,, 2005 లో చంపబడిన షణ్ముగన్ మంజునాథ్,,,2010 లో జూలై లో మరణించిన గుజరాత్ రాష్ట్ర సంబంధీకుడు అమిత్ జెతావా....ఇతడి నేరమల్లా సౌరాష్ట్ర ప్రాంతంలోని గిర్ సింహాల పరిరక్షణ కేంద్రం చుట్టు పక్కల మైనింగ్ మాఫియా కదలికలకు సంబంధించిన సమాచారం సేకరించడమే....ఇటీవల రెండు నెలలక్రితం వన్యప్రాణి సంరక్షణ కోసం కృషి చేసిన షెష్లామసూద్ ను పట్టపగలే ఆమె ఇంటి ముందే సైలెన్సర్ అమర్చిన రివాల్వర్ తో హతమార్చారు...అంతేకాదు స్థానిక బుకీల సమాచారాన్ని పోలీసులకు చేరవేశాడన్న కారణంతో సమాచారహక్కు ఉద్యమకారుడైన మేహల్ కటారియాను ముంబై లో హతమార్చే ప్రయత్నం జరిగింది.....ఇంతేనా....ప్రజా పంపిణి వ్యవస్థలో అక్రమాలను ప్రశ్నించిన పాపానికి నాందేడ్ లో బలైన రాందాస్ ఘడే గావ్ కర్,,, మహారాష్ట్ర లో భూకుంభకోణాలను బట్టబయలు చేసిన సతీష్ షెట్టి,,,జైతాపూర్ అణువిద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని అడ్డుకున్న ఇర్ఫాన్ యూసుఫ్ భాజీ,,, సంక్షేమ పథకాల్లో అవకతవకలు బయటపెట్టి బీహార్ లో అసువులు బాసిన శశిధర్ మిశ్రా,,, బెంగుళూర్ లో ప్రభుత్వ ఆస్తుల దురాక్రమణ పై సమరశంఖం పూరించిన వెంకటేష్....ఇవన్నీ సినిమాకథ లో,, ఏ హరీపోటార్ ఫిక్షన్ కథలో కావు..... అక్షరాలా జరిగిన యదార్థ సంఘటనలు.... వారిని చంపింది గుండాలు,, మాఫియా అయితే వారికీ అండగా నిలిచింది మాత్రం కొందరు రాజకీయ నాయకులు.....అధికారులు...


               ఎంతో నిజాయితిగా దేశానికి మేలు చేయాలనే సంకల్పంతో పారిశ్రామిక దోపిడి అరాచకాలను,, మాఫియా కుతంత్రాలను,,,గనుల దురాగతాలను,,, అడవుల సంరక్షణకు ఇలా అనేక సమాజ శ్రేయస్సుకు సంబంధించిన విలువైన సమాచారాన్ని బట్టబయలు చేస్తున్న కారణంగా ఎంతో మంది అశువులు బాసారు..... ఇలా అశువులు బాయాల్సిన పరిస్థితి భవిష్యతులో తలెత్తకుండా వుండాలంటే చట్టాలకు కోరలు తొడగాలి.... ప్రపంచ వ్యాప్తంగా సమాచారహక్కును పౌరుల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ వివిధ దేశాలు గట్టి చట్టాలను ఏర్పరిచి అమలుచేస్తున్నాయి.....ప్రజవేగుల ( విసిల్ బ్లోవర్స్ ప్రొటెక్షన్ ఆక్ట్) పరిరక్షణ చట్టాన్ని ప్రభుత్వ,, ప్రైవేట్ రంగాలకు వర్తింపజేస్తూ 1998 లో బ్రిటన్ తీసుకొన్న నిర్ణయం చారిత్రాత్మకమైంది....బ్రిటన్ బాటలోనే పయనించిన దక్షిణాఫ్రికా 2000 లో అదే తరహా చట్టాన్ని చేసింది.ప్రజావేగులకు అమెరికా ఇస్తున్న మర్యాద, గౌరవం, భద్రత అంతా-ఇంతా కాదు.దీనికి భిన్నంగా మన దేశ పరిస్థితి ఉన్నది.ఎంతో మంది దేశం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి విలువైన సమాచారాన్ని బుట్టదాఖలు చేసిన కారణంగా వారు బ్రతికే అర్హతను కోల్పోతున్నారు.



               ఈ నిజాయితీపరుల రక్షణార్థం ఉద్దేశించబడిన విసిల్ బ్లోవోర్స్ ప్రొటెక్షన్ బిల్ ( Whistle Blowers Protection Act) ని 2006 లో రాజ్యసభ లో ప్రవేశపెట్టినప్పటికీ విజయవంతం కాలేకపోయింది.మళ్లీ అదే బిల్లుని 2010 లో ప్రవేశపెట్టినప్పటికీ అమలుకి నోచుకోలేదు. కావున తక్షణమే WBP చట్టాన్ని అమలు అయ్యేలా చేయాలి...మనకు ఎన్నో చట్టాలున్నాయి...........ఏ చట్టం ద్వారా అంత తొందరగా సంపూర్ణ విజయం సాధించలేం.......చట్టాలు విజయవంతంగా అమలుకావాలంటే ప్రజలమైన మనం కూడా దానికి కృషి చేయాలి......ఎవడో చేస్తాడు-మనం చూస్తూ కూర్చుందాం అంటే ఏమి సాధించలేం..ఏదయినా సాధించాలంటే ప్రజల-ప్రభుత్వ భాగస్వామ్యం తప్పనిసరి.....ఒక భారతీయుడిగా అవినీతి లేని సమాజాన్ని నిర్మించడానికి మన వంతుగా పాతుపడదాం......ప్రభుత్వం WBP చట్టాన్ని చట్టరీత్యా సమర్థవంతంగా వినియోగిస్తూ సమాచారహక్కు చట్టం ద్వారా సమాజంలోని అవినీతిని కడిగి పారేసేందుకు కంకణబద్దులయిన ప్రజావేగుల యొక్క ప్రాణాలకు భరోసా ఇవ్వడమే నిజమైన సుపరిపాలనకు నిఖార్సయిన నిదర్శనం..........
జైహింద్

No comments:

Post a Comment