Saturday, 19 March 2016

"రక్షా బంధన్"

"రక్షా బంధన్"

రక్షా బంధనం కమ్మని ఆత్మీయతకు దర్శనం.
రక్షా బంధనం అంటే ఒక పవిత్ర ప్రేమకు నిదర్శనం.
సోదర సోదరీమణుల అనురాగాలకు, ఆప్యాయతలకు నిలువెత్తు సాక్ష్యం.
చిలిపి తగాదాలకు చిన్న చిన్న గొడవలకు ఆ రోజుకి స్వస్తి చెప్పే పవిత్ర దినం.
రాఖి కట్టిన సోదరికి నీకు నేనున్నానంటూ హుందాగా చెప్పే సోదర ప్రేమకు అపూర్వ క్షణం.
పరస్త్రీని కూడా మనందరి సోదరిలా చూడమంటుందీ మన భారతతత్వం మరియు సంస్కృతి.
ప్రతి వ్యక్తినీ మన వ్యక్తిగానే చూడమని చెప్తూ మానవత్వం కోసం కట్టమన్నాడు రవీంద్రుడు ఈ రాఖీ.
సోదర సోదరిమణుల ఈ బంధాన్నిటాగూర్ హిందూ-ముస్లిం ఐక్యత కోసం బెంగాల్ విభజనలో కట్టించాడీ రాఖీ.
అప్పటినుండి అర్థం మారిపోయి ఎవరు ఎవరికయినా రక్ష కోసం కట్టే ఒక పవిత్రతకి అర్థమయ్యిందీ రాఖీ...కావున....
నీకు నేను రక్షా, నాకు నువ్వు రక్షా అంటూ సౌభ్రాతృత్వాన్ని చాటుతూ కట్టుకోండి అందరూ మన ఈ రాఖీ......



జై హింద్

No comments:

Post a Comment