“యూత్ పాడయ్యిందా? పాడవుతుందా? పాదవబోతుందా?”
యూత్ పాడయ్యిందా? పాడవుతుందా? పాదవబోతుందా? అనే ఈ వ్యాసాన్ని కొన్ని సంవత్సరాలుగా రాయాలనుకుంటున్నా....ఎన్నో వ్యాసాలు రాసినప్పటికీ, ఈ వ్యాసం దగ్గరికొచ్చే సరికి రాసేంత అనుభవమూ...యూత్ ని అర్థం చేసుకునేటంత సామర్థ్యమూ నాకున్నాయా అనే ఆలోచించేవాడిని..కానీ ఈ మధ్యే ఎక్కడో చదివా “యువతకు సినిమాలు, పబ్ లు , షికార్లు, పేస్ బుక్ చాటింగ్ లు, పార్కుల్లో మీటింగులు, డేటింగులు తప్ప భగత్ సింగ్ లాంటి వీరుల గురించి తెలియదు అని”...సో అలా చదివిన తర్వాత ఆ చిన్న స్టేట్ మెంట్ నన్ను యూత్ గురించి ఇంకా ఆలోచించేలా చేసిందీ, ఈ వ్యాసం రాసేలా ప్రోత్సహించింది.
ఎలాగూ యూత్ గురించి రాస్తున్నాం కదా అని మన దేశం లో ఎంత మంది యూత్ ఉన్నారో చూద్దాం అని వెళ్లి గూగుల్ తల్లిని అడిగా.ఇక ఆ గూగుల్ తల్లి చెప్పిన విషయాలు విని నాకు మైండ్ బ్లాక్ అయినంత పనయ్యింది.ఆ విషయాలేంటో మీరు చదవండి.
1.2020 కల్లా 64% పట్టణ యువతతో ప్రపంచంలో మన దేశం మొదటి స్థానం పొందనుంది.
2.2011 లో యూత్ (15 నుండి 35 సంవత్సరాల) సంఖ్య 430 మిల్లియన్లు చేరింది.
3. పట్టణంలో ప్రతి ముగ్గురిలో ఒకరు యువతే.
4.formal skills మన దేశంలో దక్షిణ , పశ్చిమ రాష్ట్రాలకు ఎక్కువ.ఈ రాష్ట్రాలకే skills ఉండడడానికి ప్రధానకారణం విద్యా విధానాల్లో లోపాలు.
ఇదేదో గూగుల్ తల్లి ఇష్టానికి రాసింది కాదు గూగుల్ తల్లికి ఈ సమాచారాన్ని IRIS knowledge అనే సంస్థ UN-HABITATE సహాయంతో సర్వే చేసి అందించింది.ఈ కథంతా బాగానే ఉంది దీంట్లో మైండ్ బ్లాక్ అయ్యేందుకు ఏముందనే కదా మీ అనుమానం!!!.వస్తున్నా.....అ క్కడికే వస్తున్నా.....ఇంత పెద్ద యువశక్తి ఉన్న భారత్ లో వారు చెడుదారిలో వెళ్తే అది దేశానికి పెద్ద ముప్పు...అదే మంచి దారిలో వెళ్తే ఎంతో ఒప్పు...సరే ఇక కొసరు విషయం వదిలేసి అసలు విషయంలోకి వద్దాం..
యూత్ చెడిపోతుంది, చెడిపోయింది, చేడిపోబోతుందనీ చాలా మంది పెద్దలంటుంటారు.అది ఎలా డిసైడ్ అవుతారంటే దాదాపుగా పెద్దవాళ్ళు యూత్ డ్రెస్సింగ్, కట్టుబాట్లూ, టాట్టూలూ, ఆచారాలు, సంప్రదాయాలని, చూసి అలా యూత్ చెడిపోయింది అని అంటారు.యూత్ ఏమో ఫ్యాషన్స్ ఫాలో అవ్వాలంటే నలుగురిలో మేము కూడా ఉండాలంటే మేము మీ సంప్రదాయాలని పాటించం, అవన్నీ పాత చింతకాయ పచ్చడి లాంటి సంప్రదాయాలని కొట్టిపారేస్తూ లో వెస్ట్ ప్యాంటులు వేసుకుంటూ లోపల పెట్టుకోవాల్సిన డ్రాయర్ ని కూడా బయటకి ఎక్ష్ పోస్ చేస్తూ ట్రెండ్ అంటున్నారు.మారే కాలానికి తగ్గట్టూ మేమూ మారుతున్నాం అని యూత్ అంటే లేదు లేదూ మీరు చెడిపోతున్నారని పెద్దలంటున్నారు.నిజానికి వాళ్ళు చెడిపోతున్నారా??....కాలాని కి తగ్గట్టు మారుతున్నారా??..చిన్న ఉదాహరణతో ఆలోచిద్దాం మన ముత్తాతలు పాటించినవి మన తాతలు పాటించి ఉండకపోవచ్చు, మన తాతలు పాటించింది మన నాన్నలు పాటించి ఉండకపోవచ్చు, మన నాన్నలు పాటించినవి మనం పాటించకపోవచ్చు, మనం పాటించినవి మన పిల్లలూ మరియు వాళ్ల పిల్లలూ పాటించకపోవచ్చు......అలా కొన్ని పాటించనంత మాత్రాన చెడిపోవడం అవుతుందా ......కాలానికి తగ్గట్టు మారడం అవుతుందా..ప్రపంచీకరణలో అన్నీ మారుతున్నాయి కాబట్టీ మేమూ మారుతున్నాం అంటున్నారు యూత్ ...అది మార్పు కాదు మీ చెరపు అంటున్నారు పెద్దలు.....
యూత్ అన్నట్టు అది మారడమా?? పెద్దవాల్లు అన్నట్టు అది చెడడమా??....వాటిని లోతుగా పరిశీలిస్తే దాంట్లో మార్పూ ఉందీ...చెడుపూ ఉందీ...ఆ మార్పుల్లో యువతకు ఉపయోగపడే, ఉపయోగపడుతున్న కొన్ని లక్షణాలతో పాటుగా...యువతకే ఉన్న మంచి విషయాలు కొన్ని చూద్దాం.
1.అరచేతిలో విశ్వాన్ని చూసే అత్యాధునిక టెక్నాలజీ.
2.ఎలాంటి కెరీర్ ని ఎంచుకోవాలో తెలుసుకునేంత వెసులుబాటు ఉన్న మీడియా అవకాశాలు.
3.ఇంతకు ముందు తరం కన్నా తొందరగా ఏదైనా నేర్చుకునే faster generation.
4.జీవితంలో ఎదగడానికి దొరికిన అదృష్ట సమయం.
5.అనుకున్నది సాధించేదాకా వదలని విక్రమార్కుని వారసత్వం.
6.నిర్ణయాలు తీసుకునేటంత స్వేచ్చ ఉండడం.
7.ఏదైనా తొందరగా అర్థం చేసుకునే సామర్థ్యం.
మంచి ఉన్న చోటే చెడూ ఉంటుంది అని పెద్దలు ఊరికే ఏమి అనలేదు.ఆ చెడు ఏంటో కూడా చూద్దాం.
1.గడ్డాలోచ్చే సమయానికి అడ్డ దిడ్డంగా మాట్లాడడం, ఏది చెప్పినా చెవికెక్కని హార్మోన్ ప్రభావం.
2.జీవితంలో సాధించాలన్న కసి ఉండీ ఏమి చేయాలో తెలియని అవగాహనా రాహిత్యం.
3.ఏదైనా మాకు తెలుసు , ఎవడు చెప్పింది మేము వినం అనుకునే అహంభావంతో కూడిన వయసు తెచ్చిన అమాయకత్వం.
4.వ్యామోహాలే నిజమనుకునే వెర్రితనం (లవర్ ఉండాలనుకోవడం-లవర్ లేకపోతే ఎదో ఘోరం జరిగినట్టు ఫీలయ్యే కొందరు యువజనం, పబ్ ల్లో ఎంజాయ్ చెయ్యాలనుకోవడం, గబ్బు గబ్బు పనులు చెయ్యాలనుకోవడం).
5.చిన్న వయసులోనే వ్యసనాలకు (మందు,సిగరెట్,గుట్ఖా) బానిసవడం-చెడు సహవాసాలు చెయ్యడం.
6.సినిమా హీరోలనే దేవుళ్ళుగా పూజించే పిచ్చితనం (అమ్మా నాన్నలకు అంత విలువిస్తారో లేదో వాళ్ళకే తెలియాలి మరి!!)
7.ఇతరులని టీస్ చేస్తే వాళ్ళు బాధపడితే చూడాలనుకునే పైశాచికత్వం(ర్యాగ్గింగ్, నిర్భయ ఘటనలు).
8.గురు-శిష్య బంధం రోజు రోజుకీ క్షీణించడం, గురువుని గౌరవించకపోవడం.గురువుని ఎదిరిస్తే హీరో అనుకునే పనికిమాలిన తనం.
9.గ్యాంగ్ లు ఏర్పడి రోడ్లపైన హల్ చల్ చెయ్యడం హీరోయిజం అనుకునే బేవకూఫ్ తనం.
10.ఓపిక లేకపోవడం, వినే స్పృహ నేర్వకపోవడం-వ్యవస్థ వాళ్లకు నేర్పకపోవడం.
11.సినిమాల ప్రభావం.(గురువు మాట వింటే వాడు స్టూడెంట్ కాడు అని చెప్పే సినిమా డైలాగులు)
12.సోషల్ నెట్ వర్క్ సైట్ లకు అతుక్కుపోవడం, విలువైన యవ్వనాన్ని వృధా చేసుకోవడం(టెక్నాలజీలో మంచీ ఉందీ, చెడూ ఉందీ.జాగ్రత్తగా దాన్ని అవసరం మేరకే వాడుకోవాలి..అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు. )
ఇదంతా సరే మంచీ చెప్పారూ, చెడూ చెప్పారూ ఇంతకూ యూత్ పాడయినట్టా??....కానట్టా??. ..అనే అడుగుతున్నారు కదా??....సార్/మేడం “యూత్ ఒక తెల్ల కాగితం లాంటి వారు, వారిపైన మంచి అనే ఇంకు చల్లితే మంచిగా మారతారు, చెడు అనే ఇంకు చల్లితే చెడుగా మారుతారు.” భావిభారత నిర్మాతలుగా మారబోయే యువతను పెదతోవలో వెళ్ళకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అఖండ భారత్ దే....అవును అక్షరాలా నిజమే భగత్ సింగ్ , లక్ష్మి భాయి లాంటి వీర గాథలు చాలా మంది యువకులకి (యువకులకే కాదు కొందరు పెద్దలకూ) తెలియదు..ఎందుకంటే భగత్ సింగ్ పుట్టినరోజు, లక్ష్మిభాయి పుట్టినరోజు కన్నా మీడియా వాళ్ళకు ఏ టాల్లివుడ్ ,బాల్లివుడ్ హీరో పుట్టినరోజో, చచ్చిన రోజో లేకపోతే ఒక హీరోయిన్ కి పుట్టపోయేది ఆడపిల్లా?/మగపిల్లాడా? అనే విషయాలపైనే వారి ఫోకస్ అంతా...మీడియా, సినిమా వాళ్లు, సిల్వర్ స్క్రీన్ వాళ్ళనే హీరోలుగా చూపిస్తున్నారు యువత కూడా వాళ్ళనే హీరోలు అనుకుంటున్నారు....ఇక చాలా మంది టి.వి యాంకర్స్ ఎవరైనా యువత కాల్ చేసిన చాలా సమయాల్లో ...."మీకు బాయ్/ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా?"...అని అడుగుతారు...అదేదో మీకు డిగ్రీ ఉందా అన్నంత ఈజీ గా....అదే డిగ్రీ ఆ అనుకునేంత తమాషాగా!!!ఇలా అడ్డమైన విషయాలనే పట్టించుకోవడం వల్ల మన ఘన చరిత్ర మరుగునపడిపోతుంది..”చరిత్ర నాస్తి కాదు నేస్తం అది అనుభవాల ఆస్తి” అన్న శ్రీ శ్రీ మాటలు ఏ మీడియా చెవికెక్కలేదు.
మన ఘన చరిత్రను చూపడమే మరిచిన మనం, యూత్ ని నిందించడం సబబేనా?..యూత్ లో ఎదిగిన వాళ్ళని, యూత్ కి ఆదర్శ ప్రాయం అయిన వాళ్ళని మనం మన యూత్ కి చూపించి వాళ్ళని మంచి వైపు వెళ్ళేలా ప్రేరేపించాలి...అంతే కానీ చెడిపోతున్నారని గగ్గోలు పెట్టొద్దు... చిన్న వయసులోనే విశ్వవ్యాప్తంగా పేరు గడించిన వివేకానంద వారసులం మనం..ఆయన ఆదర్శాలను పునికిపుచ్చుకోవాలి మనం అని యూత్ కి తెలిసేలా చేయాలి...ఇక సినిమాల విషయానికి వస్తే “శ్రీరాముడంతటి గుణవంతుడు మాకు అక్కర్లేదు"..."ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే"...అంటూ యువతను పెడతోవలో పెట్టే సాహిత్యంతో పాటుగా నీతి మాలిన సినిమాలు, అశ్లీల భావజాలంతో కూడిన సంభాషణలు యువతను చాలా చాలా ప్రభావితం చేస్తున్నాయి.అదేంటీ పాటలూ , సినిమాల్లో చెడేనా మంచీ చూపిస్తున్నారు కదా అంటారా.ఒక్కసారి ఆలోచించండి దాదాపుగా మనిషి చెడుకే ఎక్కువ ప్రభావితుడవుతాడు..అందులో యువతకు మంచేదో చెడేదో తెలుసుకునేంత అవగాహనా, అనుభవమూ ఉండవు కాబట్టి చూపించేదే, వినేదే నిజం అనుకుంటారు.టాగూరు సినిమాలోని లంచం వద్దు అనే సందేశం కన్నా "మన్మధా మన్మధా మామపుత్రుడా" అనే శ్రేయ పాటే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది..అలా ప్రభావితం అవ్వడం సహజ మానవ మనస్తత్వం..అలా అని చెడుని ఆచరించాలని కాదు..చెడువైపు వెళ్ళకుండా, చెడు చూపించకుండా తగిన చర్యలు తీసుకోవాలి..మీరు అలాంటి సినిమాలు, సాహిత్యానికి అలవాటు పడ్డారు కాబట్టే మేము అవి తీస్తున్నాం అని సినిమా వాళ్ళు, మాది కూడా అదే అభిప్రాయం అని మీడియా వాళ్ళు జనాలపైకే తప్పుని తోసేస్తున్నారు.మీరు అవే తీస్తున్నారు మరియు చూపిసున్నారు కాబట్టే మేము చూస్తున్నాం, తప్పు మీదే అంటున్నారు జనాలు.తప్పెవరిదన్నది కాదు పాయింట్ ఇక్కడ , అవి యువతను పాడు చేస్తాయి అనేది పాయింట్.విలువల్ని మరిచిపోయి ఇవ్వాల్సిన వాటికి ప్రాధాన్యం ఇవ్వకుండా అడ్డమైన వాటికి ప్రాధాన్యం ఇచ్చే ప్రతి ఒక్కరిదీ తప్పే ఇక్కడ.ఆ ప్రతి ఒక్కరూ సమాజంలో ఉంటారు కాబట్టి మంచికైనా-చెడుకైనా నాందీ ప్రస్థావన జరిగేది సమాజంలోనే..సో యువత చెడిపోతున్నారనే దానికన్నా చెడిపోకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుందాం.
చెడిపోతున్నవాడ ికి నువ్వు చెడిపోతున్నావ్ రా అంటే అస్సలు నమ్మడు, అలా నమ్మే వాడే అయ్యుంటే అటు వెళ్ళే వాడు కాదు కదా!!!..ఒక వేళ తెలిసీ వెళ్ళినా, ఎదో తెలియక వెళ్లినా తన తప్పుని ఒప్పుకోవడానికి అహం అడ్డొస్తుంది కాబట్టి అంత తొందరగా మారే అవకాశం తక్కువ..యువత కాలంతో పాటూ మేమూ మారుతున్నాం అంటుంటే... అది మార్పేనా చెడుపేనా...అన్న విషయం వాళ్లకి అర్థం అయ్యేలా వాళ్ల భాషలో చెప్పాలి...యూత్ కూడా పెద్దవాళ్ళు అనుభవంతో చెపుతున్న వాటిని విని మంచేదో చెడేదో తెలుసుకునేంత పరిపక్వత (maturity) సాధించాలి...ఆ పరిపక్వత రావాలంటే మంచి వారితో స్నేహం చెయ్యాలి, మంచి సాహిత్య విలువలున్న పుస్తకాలు చదవాలి.కుటుంబ వ్యవస్థ మరియు విద్యా వ్యవస్థ మార్కుల కోసం విద్య అనే దాన్ని వదిలిపెట్టి విలువల కోసం విద్య అనే దానిపైన దృష్టిపెట్టి యువతని మంచి మార్గం వైపు నడిపించాలి.ఇక యువతలో కొందరు చెడిపోయారని అందరినీ అలా జమ కట్టేయొద్దు.మన పరువుని మనమే తీసుకోవద్దు..మన తండ్రి త్రాగుబోతు అయినంత మాత్రాన మనమే డప్పేసి చాటింపు వెయ్యకుండా ఆయన్ని మార్చుకోవడానికి ప్రయత్నించినట్టే యువత విషయంలోనూ అలానే ప్రవర్తిద్దాం...యువతలో ఉన్న కసిని, పట్టుదలని బయటకి తీసేలా ప్రవర్తిద్దాం...ఎవ్వరినీ ఎప్పుడూ చెడిపోయావ్,నీ వల్ల కాదు అని అనకండి...సాధ్యమైతే వెన్నుతట్టుదాం...లేకపోతే అలా ఊరికే ఉండిపోండి..ఎవరినీ కించపరుచొద్దు..యువతకు మార్పేదో.....చెరుపేదో తెలియచెబుదాం...ముందుగా మనం మారుదాం....మనం ఆలోచనా విధానం మారుద్దాం...ఇక ఫైనల్ గా వివేకానందుడి మాటలు యువత కోసం ....ఓ యువతా మేల్కో, సమస్త శక్తి అంతా నీలోనే ఉంది, నువ్వు దేన్నయినా సాధించగలవు....బలమే జీవనం –బలహీనతే మరణం అనే సూక్తి మనసులో పెట్టుకుని సింహాల్లా ఘర్గించి దేశానికీ-మీకూ మంచి పేరు తెచ్చుకోండి......జై హింద్
యూత్ పాడయ్యిందా? పాడవుతుందా? పాదవబోతుందా? అనే ఈ వ్యాసాన్ని కొన్ని సంవత్సరాలుగా రాయాలనుకుంటున్నా....ఎన్నో వ్యాసాలు రాసినప్పటికీ, ఈ వ్యాసం దగ్గరికొచ్చే సరికి రాసేంత అనుభవమూ...యూత్ ని అర్థం చేసుకునేటంత సామర్థ్యమూ నాకున్నాయా అనే ఆలోచించేవాడిని..కానీ ఈ మధ్యే ఎక్కడో చదివా “యువతకు సినిమాలు, పబ్ లు , షికార్లు, పేస్ బుక్ చాటింగ్ లు, పార్కుల్లో మీటింగులు, డేటింగులు తప్ప భగత్ సింగ్ లాంటి వీరుల గురించి తెలియదు అని”...సో అలా చదివిన తర్వాత ఆ చిన్న స్టేట్ మెంట్ నన్ను యూత్ గురించి ఇంకా ఆలోచించేలా చేసిందీ, ఈ వ్యాసం రాసేలా ప్రోత్సహించింది.
ఎలాగూ యూత్ గురించి రాస్తున్నాం కదా అని మన దేశం లో ఎంత మంది యూత్ ఉన్నారో చూద్దాం అని వెళ్లి గూగుల్ తల్లిని అడిగా.ఇక ఆ గూగుల్ తల్లి చెప్పిన విషయాలు విని నాకు మైండ్ బ్లాక్ అయినంత పనయ్యింది.ఆ విషయాలేంటో మీరు చదవండి.
1.2020 కల్లా 64% పట్టణ యువతతో ప్రపంచంలో మన దేశం మొదటి స్థానం పొందనుంది.
2.2011 లో యూత్ (15 నుండి 35 సంవత్సరాల) సంఖ్య 430 మిల్లియన్లు చేరింది.
3. పట్టణంలో ప్రతి ముగ్గురిలో ఒకరు యువతే.
4.formal skills మన దేశంలో దక్షిణ , పశ్చిమ రాష్ట్రాలకు ఎక్కువ.ఈ రాష్ట్రాలకే skills ఉండడడానికి ప్రధానకారణం విద్యా విధానాల్లో లోపాలు.
ఇదేదో గూగుల్ తల్లి ఇష్టానికి రాసింది కాదు గూగుల్ తల్లికి ఈ సమాచారాన్ని IRIS knowledge అనే సంస్థ UN-HABITATE సహాయంతో సర్వే చేసి అందించింది.ఈ కథంతా బాగానే ఉంది దీంట్లో మైండ్ బ్లాక్ అయ్యేందుకు ఏముందనే కదా మీ అనుమానం!!!.వస్తున్నా.....అ
యూత్ చెడిపోతుంది, చెడిపోయింది, చేడిపోబోతుందనీ చాలా మంది పెద్దలంటుంటారు.అది ఎలా డిసైడ్ అవుతారంటే దాదాపుగా పెద్దవాళ్ళు యూత్ డ్రెస్సింగ్, కట్టుబాట్లూ, టాట్టూలూ, ఆచారాలు, సంప్రదాయాలని, చూసి అలా యూత్ చెడిపోయింది అని అంటారు.యూత్ ఏమో ఫ్యాషన్స్ ఫాలో అవ్వాలంటే నలుగురిలో మేము కూడా ఉండాలంటే మేము మీ సంప్రదాయాలని పాటించం, అవన్నీ పాత చింతకాయ పచ్చడి లాంటి సంప్రదాయాలని కొట్టిపారేస్తూ లో వెస్ట్ ప్యాంటులు వేసుకుంటూ లోపల పెట్టుకోవాల్సిన డ్రాయర్ ని కూడా బయటకి ఎక్ష్ పోస్ చేస్తూ ట్రెండ్ అంటున్నారు.మారే కాలానికి తగ్గట్టూ మేమూ మారుతున్నాం అని యూత్ అంటే లేదు లేదూ మీరు చెడిపోతున్నారని పెద్దలంటున్నారు.నిజానికి వాళ్ళు చెడిపోతున్నారా??....కాలాని
యూత్ అన్నట్టు అది మారడమా?? పెద్దవాల్లు అన్నట్టు అది చెడడమా??....వాటిని లోతుగా పరిశీలిస్తే దాంట్లో మార్పూ ఉందీ...చెడుపూ ఉందీ...ఆ మార్పుల్లో యువతకు ఉపయోగపడే, ఉపయోగపడుతున్న కొన్ని లక్షణాలతో పాటుగా...యువతకే ఉన్న మంచి విషయాలు కొన్ని చూద్దాం.
1.అరచేతిలో విశ్వాన్ని చూసే అత్యాధునిక టెక్నాలజీ.
2.ఎలాంటి కెరీర్ ని ఎంచుకోవాలో తెలుసుకునేంత వెసులుబాటు ఉన్న మీడియా అవకాశాలు.
3.ఇంతకు ముందు తరం కన్నా తొందరగా ఏదైనా నేర్చుకునే faster generation.
4.జీవితంలో ఎదగడానికి దొరికిన అదృష్ట సమయం.
5.అనుకున్నది సాధించేదాకా వదలని విక్రమార్కుని వారసత్వం.
6.నిర్ణయాలు తీసుకునేటంత స్వేచ్చ ఉండడం.
7.ఏదైనా తొందరగా అర్థం చేసుకునే సామర్థ్యం.
మంచి ఉన్న చోటే చెడూ ఉంటుంది అని పెద్దలు ఊరికే ఏమి అనలేదు.ఆ చెడు ఏంటో కూడా చూద్దాం.
1.గడ్డాలోచ్చే సమయానికి అడ్డ దిడ్డంగా మాట్లాడడం, ఏది చెప్పినా చెవికెక్కని హార్మోన్ ప్రభావం.
2.జీవితంలో సాధించాలన్న కసి ఉండీ ఏమి చేయాలో తెలియని అవగాహనా రాహిత్యం.
3.ఏదైనా మాకు తెలుసు , ఎవడు చెప్పింది మేము వినం అనుకునే అహంభావంతో కూడిన వయసు తెచ్చిన అమాయకత్వం.
4.వ్యామోహాలే నిజమనుకునే వెర్రితనం (లవర్ ఉండాలనుకోవడం-లవర్ లేకపోతే ఎదో ఘోరం జరిగినట్టు ఫీలయ్యే కొందరు యువజనం, పబ్ ల్లో ఎంజాయ్ చెయ్యాలనుకోవడం, గబ్బు గబ్బు పనులు చెయ్యాలనుకోవడం).
5.చిన్న వయసులోనే వ్యసనాలకు (మందు,సిగరెట్,గుట్ఖా) బానిసవడం-చెడు సహవాసాలు చెయ్యడం.
6.సినిమా హీరోలనే దేవుళ్ళుగా పూజించే పిచ్చితనం (అమ్మా నాన్నలకు అంత విలువిస్తారో లేదో వాళ్ళకే తెలియాలి మరి!!)
7.ఇతరులని టీస్ చేస్తే వాళ్ళు బాధపడితే చూడాలనుకునే పైశాచికత్వం(ర్యాగ్గింగ్, నిర్భయ ఘటనలు).
8.గురు-శిష్య బంధం రోజు రోజుకీ క్షీణించడం, గురువుని గౌరవించకపోవడం.గురువుని ఎదిరిస్తే హీరో అనుకునే పనికిమాలిన తనం.
9.గ్యాంగ్ లు ఏర్పడి రోడ్లపైన హల్ చల్ చెయ్యడం హీరోయిజం అనుకునే బేవకూఫ్ తనం.
10.ఓపిక లేకపోవడం, వినే స్పృహ నేర్వకపోవడం-వ్యవస్థ వాళ్లకు నేర్పకపోవడం.
11.సినిమాల ప్రభావం.(గురువు మాట వింటే వాడు స్టూడెంట్ కాడు అని చెప్పే సినిమా డైలాగులు)
12.సోషల్ నెట్ వర్క్ సైట్ లకు అతుక్కుపోవడం, విలువైన యవ్వనాన్ని వృధా చేసుకోవడం(టెక్నాలజీలో మంచీ ఉందీ, చెడూ ఉందీ.జాగ్రత్తగా దాన్ని అవసరం మేరకే వాడుకోవాలి..అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు. )
ఇదంతా సరే మంచీ చెప్పారూ, చెడూ చెప్పారూ ఇంతకూ యూత్ పాడయినట్టా??....కానట్టా??.
మన ఘన చరిత్రను చూపడమే మరిచిన మనం, యూత్ ని నిందించడం సబబేనా?..యూత్ లో ఎదిగిన వాళ్ళని, యూత్ కి ఆదర్శ ప్రాయం అయిన వాళ్ళని మనం మన యూత్ కి చూపించి వాళ్ళని మంచి వైపు వెళ్ళేలా ప్రేరేపించాలి...అంతే కానీ చెడిపోతున్నారని గగ్గోలు పెట్టొద్దు... చిన్న వయసులోనే విశ్వవ్యాప్తంగా పేరు గడించిన వివేకానంద వారసులం మనం..ఆయన ఆదర్శాలను పునికిపుచ్చుకోవాలి మనం అని యూత్ కి తెలిసేలా చేయాలి...ఇక సినిమాల విషయానికి వస్తే “శ్రీరాముడంతటి గుణవంతుడు మాకు అక్కర్లేదు"..."ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే"...అంటూ యువతను పెడతోవలో పెట్టే సాహిత్యంతో పాటుగా నీతి మాలిన సినిమాలు, అశ్లీల భావజాలంతో కూడిన సంభాషణలు యువతను చాలా చాలా ప్రభావితం చేస్తున్నాయి.అదేంటీ పాటలూ , సినిమాల్లో చెడేనా మంచీ చూపిస్తున్నారు కదా అంటారా.ఒక్కసారి ఆలోచించండి దాదాపుగా మనిషి చెడుకే ఎక్కువ ప్రభావితుడవుతాడు..అందులో యువతకు మంచేదో చెడేదో తెలుసుకునేంత అవగాహనా, అనుభవమూ ఉండవు కాబట్టి చూపించేదే, వినేదే నిజం అనుకుంటారు.టాగూరు సినిమాలోని లంచం వద్దు అనే సందేశం కన్నా "మన్మధా మన్మధా మామపుత్రుడా" అనే శ్రేయ పాటే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది..అలా ప్రభావితం అవ్వడం సహజ మానవ మనస్తత్వం..అలా అని చెడుని ఆచరించాలని కాదు..చెడువైపు వెళ్ళకుండా, చెడు చూపించకుండా తగిన చర్యలు తీసుకోవాలి..మీరు అలాంటి సినిమాలు, సాహిత్యానికి అలవాటు పడ్డారు కాబట్టే మేము అవి తీస్తున్నాం అని సినిమా వాళ్ళు, మాది కూడా అదే అభిప్రాయం అని మీడియా వాళ్ళు జనాలపైకే తప్పుని తోసేస్తున్నారు.మీరు అవే తీస్తున్నారు మరియు చూపిసున్నారు కాబట్టే మేము చూస్తున్నాం, తప్పు మీదే అంటున్నారు జనాలు.తప్పెవరిదన్నది కాదు పాయింట్ ఇక్కడ , అవి యువతను పాడు చేస్తాయి అనేది పాయింట్.విలువల్ని మరిచిపోయి ఇవ్వాల్సిన వాటికి ప్రాధాన్యం ఇవ్వకుండా అడ్డమైన వాటికి ప్రాధాన్యం ఇచ్చే ప్రతి ఒక్కరిదీ తప్పే ఇక్కడ.ఆ ప్రతి ఒక్కరూ సమాజంలో ఉంటారు కాబట్టి మంచికైనా-చెడుకైనా నాందీ ప్రస్థావన జరిగేది సమాజంలోనే..సో యువత చెడిపోతున్నారనే దానికన్నా చెడిపోకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుందాం.
చెడిపోతున్నవాడ

No comments:
Post a Comment