Wednesday, 23 March 2016

IAS అవ్వడం కష్టమా???




IAS అవ్వడానికి చిన్నప్పటి నుండి గొప్ప మార్కులతో పాస్ అవ్వాలనే నియమం ఏమి లేదా?
కచ్చితంగా లేదు...
అలా అని మంచిగా చదువొద్దు అని చెప్పట్లేదు, చదివితే ఇంకా మంచిది.
ఎలా చదివినా నీకంటూ ఒక ఆత్మవిశ్వాసం , పట్టుదల, ధైర్యం ఉండాలి.
అలా....
 ఎలా చదివిన నీకంటూ ఒక పరిణితి వచ్చాక నీకు ఏదైనా సాధ్యమే.
కావాలంటే ఈ కింద ఇచ్చిన వీడియో చూడండి,
ఈ వీడియో లోని వ్యక్తి ఒకమారు మూల పల్లె నుండి వచ్చి ,
ఇంటర్మీడియట్ లో మరియు డిగ్రీ లో సెకండ్ క్లాసు లో పాస్ అయి తరువాత IAS సాధించిన ఈ వ్యక్తి తల్లిదండ్రులకి మరియు విద్యార్థులకి చెప్పే సందేశం వినండి...
https://www.youtube.com/watch?v=gpbzE5sWXOs

అటు పిమ్మట ఇవి చదవండి.....
 IAS కావాలంటే ఉండాల్సిన 10 ముఖ్య లక్షణాలు (ఇదేదో థియరీ కాదు ఈ లక్షణాలు ఉంటే వస్తుంది అని చెప్పడానికి, అర్థం చేసుకోండి జీవితాన్ని, ఈ లక్షణాలు ఉంటే మాక్సిమం అవకాశాలుంటాయి)
1. Syllabus ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆకళింపు చేసుకోవాలి.
2. పాత ప్రశ్న పత్రాల ద్వారా పరీక్షల సరళిని పట్టుకోవాలి.
3. రోజుకి ఎన్ని గంటలు చదివాం అన్నది కాకుండా ఎంత సబ్జెక్టు నేర్చుకున్నాం అనేలా చదవాలి (కానీ రోజూ చదవాలి).
4. సమాజంలో జరుగుతున్న ప్రతి విషయం పైన అవగాహన ఉండాలి (రీసెర్చ్ చెయ్యాల్సిన అవసరం లేదు).
5. కోచింగ్ తీసుకోవాలా? వద్దా? అంటే మాత్రం గత కొన్ని సంవత్సరాల ప్రశ్నాపత్రాలని బట్టి చూస్తే కోచింగ్ అవసరం లేదు అనిపిస్తుంది. (అది మీ మీ వ్యక్తిగత నైపుణ్యం పైన కూడా ఆధారపడుంటుంది, సో చూస్కోండి)
6. సమాజాన్ని దగ్గరగా చూడాలి ( from LOCAL to GLOBAL level observation according to syllabus only, plz don’t go beyond syllabus level).
7. Daily schedules, Monthly schedules పెట్టుకొని మరీ చదవాలి.
8. ఎప్పుడూ మనల్ని మన లక్ష్యం వైపు ప్రోత్సహించే స్నేహితుల, గురువుల, శ్రేయోభిలాషుల సాంగత్యంలోనే గడపాలి. మిమ్మల్ని లక్ష్యానికి దూరం చేసేలా అనిపిస్తున్న వ్యక్తులని దూరంగా పెట్టండి. వ్యక్తులని confuse చేసే మనుషులు ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటారు, వాళ్లను లైట్ తీస్కోండి. s"U"ccess depends on the second letter of the word ,tats it.
9. మానసిక ప్రశాంతత ఉండాలి. నీతో పాటుగా ప్రిపేర్ అయిన వాళ్లకి నీకంటే ముందుగా విజయం వరించి ఉండొచ్చు, వాళ్లలో కొందరు నీతో మునుపటిలా ఉండొచ్చు, కొందరు మారిపోనూ వచ్చు , ఇవన్నీ సాధారణం అనుకుని నీ విజయం కోసం పోరాడు- విజయాన్ని పొందు.
10. అన్నిటికన్నా ముఖ్యమైనది “నేను దేశానికి సేవ చెయ్యాలి , నా దేశ ప్రజల కోసం పాటుపడాలి “ అనే లక్షణం మిమ్మల్ని విజయ తీరాలకు కచ్చితంగా చేరుస్తుంది. అదేకాదు మీకు Attitude లేకపోతే అది మీకు ప్రేపరషన్లో , ఇంటర్వ్యూలో & సర్వీసులో ఉపయోగపడొచ్చు. Talent shines very much with good character. 

                                      ఈ లక్షణాలతో పాటుగా విజయం కోసం పోరాడే ధీరుడిలో ఉండే పట్టుదల, ఓపిక, ప్రశాంతత ఉండాలి. ఓటమిని తట్టుకునే ధైర్యం కూడా ఉండాలి, ఎందుకంటే ఈ పరీక్షలో కొందరు ప్రథమ ప్రయత్నంలో కల నెరవేర్చుకోవచ్చు, ఇంకొందరు ఆఖరి ప్రయత్నంలో కల నెరవేర్చుకోవచ్చు....ఇంకొందరిని విజయం వరించకపోవచ్చు, దానికి ఏం కంగారు పడొద్దు (ఒకవేళ మీరు నిజాయితీగా ప్రయత్నించి ఉంటె డిప్రేస్స్ అవ్వకండి , నేర్చుకున్న జ్ఞానం మీకు ఎక్కడో అక్కడ కచ్చితంగా ఉపయోగపడుతుంది)....సివిల్స్ వచ్చినా , రాకపోయినా నువ్వు మనిషిగా బ్రతికే ఉంటావ్, ఏదో ఒకటి సాధించేందుకు మనిషికి ఎప్పుడూ ఏదో ఒక అవకాశం ఉండనే ఉంటుంది.

చివరగా
“గొప్ప లక్ష్యం కోసం పోరాడే దారిలో
రాళ్లు ఎదురవ్వొచ్చు, రత్నాలు ఎదురవ్వొచ్చు,
సో.....
రాళ్ళను దాటుకుంటూ ,
రత్నాలను ఏరుకుంటూ,
నీ గమ్యం కోసం సాగిపోతూ ఉండు,
విజయం తథ్యం..........
(IAS అవ్వడం కోసం మీకు ఏవయినా సందేహాలుంటే అడగండి, నాకు తెలిసిన సమాచారం నా ఖాళీ సమయాల్లో అందిస్తా )
ఇంకో ముఖ్య విషయం
పైన వీడియోలో చూపించిన వ్యక్తి నా close friend , అతను ఎప్పుడూ కూల్ గా ఉండేవాడు, అందుకే IAS అతన్ని వరించింది, మిమ్మల్నీ వరిస్తుంది.
Be Cool and Confident….
Always Be Positive
అల్ ది బెస్ట్ .......

జై హింద్........

Saturday, 19 March 2016

అసహనమా నువ్వెకడా????



అసహనమా నువ్వెకడా????





అవును.....నిజంగానే దేశంలో అసహనం పెరిగిపోతుంది....భారతదేశం నా మాతృభూమి , భారతీయుడిగా నేనెప్పుడూ గర్విస్తూ – ఘర్జిస్తూ ఉంటాను.అలా బ్రతికే ఈ దేశ సామాన్య మానవుల్లో ఒకడినైన నాకు అసహనం పెరిగిపోయింది....ఇది అలాంటి , ఇలాంటి అసహనం కాదు. దేశంలో ఈ మధ్య తలెత్తిన అసహనపు గాలుల వల్ల ఏర్పడిన అసహనం. దేశంలో ప్రస్తుత పరిస్తితులు నా సహనం కోల్పోయేలా చేసాయి...అసహనం నన్ను ఆవహించింది, అలా ఆవహించిన అసహనమే నాతో ఇలా రాయిస్తుంది.
గత కొన్ని రోజులుగా సామాన్య మానవుడిని నుండి దేశ ప్రధాని & రాష్ట్రపతి నోట్లో నానుతున్న పదం “అసహనం” . ఈ దేశంలో అసహనం ఎందుకు పెరిగింది? పెరుగుతోంది? భవిష్యత్తులో కూడా పెరగబోతుందా?...దేశంలో అసహనం అనే పదం చక్కర్లు కొట్టడానికి రాజకీయ, ఆర్ధిక, సామజిక, కొంత వరకు అంతర్జాతీయ కారణాలు అనేకం ఉన్నాయి.దేశం కోసం , దేశ పరువు కోసం నిష్పక్షపాతంగా ఆలోచిస్తే అవన్నీ మన కళ్ళ ముందు కదలాడతాయి.



మనదేశంలో పుట్టినందుకు మనం ఎప్పుడూ గర్విస్తూనే ఉంటాం . అదేం ఖర్మో తెలీదు కానీ దేశంలో పరిస్థితుల గురించి ఎప్పుడూ అసహనం వెల్లగక్కుతూనే ఉంటాం. నిద్రలేస్తూనే ఇంట్లో నీళ్లు రాలేదని , పడుకోబోయే ముందు కరెంటు లేదనీ ప్రభుత్వాలపైన అసహనం వెల్లగక్కుతాం. ఆఫీసుకి / స్కూల్ కి వెళ్ళడానికి రోడ్డెక్కిన మనం ట్రాఫిక్ కి ముందు వాడే కారణం అంటూ అసహనం వెల్లగక్కుతాం, ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేయించుకోవడం చేతగాని మనం అధికారులందరూ లంచగొండులని అసహనం వెల్లగక్కుతాం, నాణ్యమైన విద్యా- వైద్య సదుపాయాలు అందించలేదని మనమే అందలం ఎక్కించిన రాజకీయ నాయకులపైన అసహనం వెల్లగక్కుతాం, రిజర్వేషన్స్ పైన కొందరం అసహనం వెల్లగక్కుతాం, వరకట్నంపైన అసహనం వెల్లగక్కుతాం, ఆడపిల్ల పుట్టిందని దేశంలో కొంత మంది అసహనం వెల్లగక్కుతారు, పేద – ధనిక అంతరాలకి కారణం ప్రభుత్వ విధానాలే అని అసహనం వెల్లగక్కుతాం, స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇలాంటి ఎన్నో సామాజిక, ఆర్ధిక విషయాలపైన మనలో మనమే అసహనం వెల్లగక్కామం. కానీ ఇప్పటిలా, ఇంతలా ఎప్పుడూ అసహనం గురించి మాట్లాడుకోవడం, రోడ్లెక్కడం జరగలేదు. కానీ ఈ మధ్య ఈ “అసహనం” అనే పదం చక్కర్లు కొట్టడానికి రాజకీయ కారణాలు లేకపోలేదు.



కేంద్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీయే అయినప్పటికీ చాలా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీయేతర పార్టీలు రాష్ట్రాలను ఏలుతున్నాయి . వీటిలో చాలా మటుకు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేక పార్టీలు. వ్యతిరేకం అంటే , సిద్ధాంతపరంగా, ఓటు బ్యాంకు పరంగా వ్యతిరేకం. దాదాపు 17 రాష్ట్రాల్లో ( అస్సోం, అరుణాచల్ ప్రదేశ్ , హిమాచల్ ప్రదేశ్ , కర్నాటక , కేరళ, మణిపూర్ , మేఘాలయ, మిజోరాం, ఉత్తరాఖండ్ లాంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలే కాకుండా బీహార్, ఢిల్లీ , ఒడిశా , తమిళనాడు , తెలంగాణ, త్రిపుర, పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి) భారతీయ జనతా పార్టీయేతర పార్టీలు ప్రభుత్వాలను ఏర్పరిచాయి. ఈ రాష్ట్రాలు తమ ఉనికి కోసం , తమ ఓటు బ్యాంకు కోసం భారతీయ జనతా పార్టీని విమర్శిస్తుంటాయి. ఆ విమర్శలు భారతీయ జనతా పార్టీకి పరిమితమవ్వాలే తప్ప కేంద్ర ప్రభుత్వాన్ని , ప్రధానిని నిందించే దాకా వెళ్ళరాదు. అలాగే దేశంలో ఈ మధ్య అసహనపు మాట చక్కర్లు కొట్టడానికి కొందరు భారతీయ జనతా పార్టీ M.P ల వైఖరి కూడా కారణం అయ్యిండొచ్చు. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నరేంద్ర మోడీ గారు అలాంటి వారిని అదుపులో ఉంచితే అది భారతీయ జనతా పార్టీకే కాదు దేశానికి కూడా మంచిది. అలాగే భారతీయ జనతా పార్టీలోని కొందరు M.P ల వ్యక్తిగత మాటలని , కొందరు పనిగట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి అంటగడుతున్నారు, ఇది సమంజసం కాదు. ఇక కొందరు సినిమా తారలు తమ తమ వ్యక్తిగత అభిప్రాయాలు వెలిబుచ్చే ముందు అవి భారతదేశంపైన ఎంత ప్రభావం చూపుతాయో ఆలోచించుకొని మాట్లాడాలి, ఈ దేశం ఆ తారలకు ఎంతో ఇచ్చింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు, ఈ దేశంలో అసహనమే రాజ్యం ఏలుతుంటే వారు అంత గొప్పవారు అయ్యేవారు కాదు, భారతీయుల్లో అసహనం లేదు అనడానికి వాళ్ల ఎదుగుదలే కారణం.



ప్రపంచానికి శాంతి- సహనం నేర్పించిన గౌతమ బుద్ధుడు జన్మించిన భారతదేశం మనది. సూర్యుడస్తమించని రాజ్యానికి పడమటి దారులు చూపించిన శాంతి దూత , సహనశీలి అయిన మహాత్మాగాంధి నడయాడిన దేశం మనది. నేను – నా దేశం అనే దాంట్లో , నేను నా దేశానికే ఎక్కువ విలువనిస్తాను అని చాటిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పుట్టిన గడ్డ మనది. సర్వమానవ సౌబ్రాత్రుత్వం నేర్పిన వివేకానంద ఊపిరిలూదిన జాతి మనది. ఒక బ్రహ్మచారి (ఈ శతాబ్దపు నవయుగ పురుషుడు - కలాం) పరమపదిస్తే యావత్ భారతజాతి కన్నీటి సంద్రంలో మునిగిన జాతి మనది. ఈ దేశ పౌరులను ఎందరినో ఊచకోత కోసిన కసబ్ లాంటి వాళ్లని పందుల్లా మేపేటంతటి సహనపు దేశం మనది. ఈ దేశంలో ఉంటూ, జాతీయవాదం కన్నా అంతర్జాతీయ భావాలకు విలువనిచ్చే రాజకీయ పార్టీలను భరిస్తున్న దేశం మనది. జాతీయ గీతాలాపనకి గౌరవం ప్రకటించకపోవడం తమ మతాభీష్టం అన్నా కూడా సహించేటంత సహనం మనది.


ఒక దేశంలో ఉండాల్సిన ముఖ్యమైన వాటిలో జాతీయవాదం – దేశభక్తి అత్యంత ప్రధానమైనవి. మనం ఎంత కాదన్నా ప్రస్తుతం మన దేశంలో ఈ రెండూ చాలా చాలా తక్కువ మొతాదులోనే ఉన్నాయి. ఈ రెండూ లేనంత వరకు మనం, అసహనం అంటూ రోడ్లెక్కుతాం, గోల చేస్తాం. దేశంలో వీచాల్సినవి మంచి- చెడు అనే పవనాలే కానీ కాషాయానికి అనుకూల పవనాలు , కాషాయానికి వ్యతిరేక పవనాలు కాదు. అది దేశ భవిష్యత్తుకి అవరోధమే కాదు మన ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుంది. రాజకీయ నాయకుల, పార్టీల సైద్ధాంతిక విధానాలు వేరైనప్పటికీ వాటన్నిటినీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకోవద్దు. ఆ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశ పరువు – ప్రతిష్టలను దయచేసి పణంగా పెట్టొద్దు. ఇప్పటికే చాలా దేశాలు మనదేశం ఎప్పుడు దిగాజారుతుందా అని గుంటకాడి నక్కలా ఎదురు చూస్తున్నాయి. మీరు అలాంటి నక్కలకి ఊతం ఇవ్వొద్దు..ఇక భారతీయ పౌరలమైన మనం ప్రతి అడ్డమైన వాడి మాటకు విలువనివ్వొద్దు. చదువుకున్న చదువు , ఆ చదువు నేర్పిన సంస్కారం మంచేదో – చెడేదో బేరీజు వేసుకునేలా ఉండాలి. మనం ఎప్పుడూ మంచికే ఊతమివ్వాలి , ఆ మంచిలో జాతి ప్రయోజనాలుండాలి.ఇంకా ముఖ్యమైన విషయం- వ్యక్తిగత పురోభివృద్ధికి, దేశ పురోభివృద్ధికి ఉపయోగపడని ఎలాంటి విషయాలకు అంత ప్రాధాన్యత ఇవ్వకండి. అది దేశానికి , మన దేహానికి ఎంతో మేలు చేస్తుంది.



ప్రపంచ దేశాలకు విలువలు , సంస్కృతి , సంప్రదాయాలు , నేర్పిన భారతదేశంలో అసహనం ఎప్పుడూ లేదు. ఇప్పుడు కూడా లేదు. ఒకవేళ ఉంటె అది ఏ కొందరికో, కొన్ని కారణాల వల్ల ఏర్పడిన అసహనాలే తప్ప వేరే ఇంకేం కాదు. 125 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో, దేశపు పరిస్థితులు పట్టించుకోకుండా చాలా మంది ఎంతో హాయిగా జీవిస్తున్నారు. దాంట్లో కొందరు మహానుభావులు తమ తమ వ్యక్తిగత అసహనాన్ని దేశానికి ఆపాదిస్తున్నారు. భారతదేశంలో సహనం తప్ప అసలు “అసహనం” అనే పదమే లేదు. “సర్వే జనః సుఖినో భవంతు” అనే దేశంలో అసహనం ఉందనడం ఒక అపహాస్యమే తప్ప ఇంకోటి కాదు.

గమనిక: ఎమర్జెన్సీ, సిక్కుల ఊచకోత, తస్లిమా నస్రీన్, లాంటి కొన్ని ఉదాహరణలు ఈ మధ్య చదివా. వాటిని కూడా ఇక్కడ రాస్తే కొందరు “ అసహనవాదులు” నన్ను కూడా కాషాయపు రంగులో ముంచేస్తారేమో...

భరతమాతా!!!!...కాపాడు నీ బిడ్డలని అందరినీ

జై హింద్...🖋️🇮🇳

భరతమాత (అమ్మ) కోసం......






భరతమాత (అమ్మ) కోసం......

ఊయలలో హాయిగా ఊగుతున్న నన్ను చూసి మా అమ్మ (చదువురాని) బాధపడుతుంది – భయపడుతుంది ,

చదువుకున్న మారాజులైన మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,

చదువుకున్న చదువులకి పరమార్థం తెలియని మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,

మా కులమే గొప్ప అనుకునే మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,

మా మతమే గొప్ప అనుకునే మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,

మీ భావప్రకటన స్వేచ్చ ఇంకొకరికి స్వేచ్చకి భంగమా అని ఆలోచించని మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,

ఒక ఉగ్రవాదిని ఉరితీయడం తగదు అని ఊరేగింపులు చేసే మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,

వ్యక్తుల భజన చేస్తూ వ్యవస్థ ఏమైపోతేనేమి అనుకునే మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,

తప్పు చేసే నాయకుడిని వెనకేసుకొచ్చే మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,

భారతీయులందరూ నా సహోదరులు అని పాటశాలల్లో చేసిన ప్రతిజ్ఞ మీరు మరిచారా? అని మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,

ఎన్నుకున్న ప్రభుత్వాలపైన గౌరవం లేని మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,

ప్రభుత్వ కార్యాలయాల్లో నిజాయితీగా పని చేయించుకోవడం చేతకాని మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,

తప్పు చేసేవాడిని నిలదీయలేని పిరికివాల్లైన మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,

ఆడవాళ్లను అంగట్లో సరుకులా చూసే మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,

జాతీయ పండుగలంటే సెలువులు అనుకునే మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,

మువ్వన్నెల జెండా కున్న పొగరు మీ నరాల్లో లేని మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,

దేశ ప్రజలందరూ నా వాళ్లు అనుకోని మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,

వ్యక్తిగత హితం కన్నా భారతదేశ హితమే గొప్ప అనుకోని మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,

భిన్నత్వంలో ఏకత్వం అంటే అర్థమే తెలియని మీ అజ్ఞానాన్ని చూసి మా అమ్మ భయపడుతుంది,

భారతదేశ ఔనత్యం గురించి అంతగా తెలియని మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,

భారత జాతి గౌరవం కోసం ఆలోచించని మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది- బాధపడుతుంది,

భారతీయుల శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం అని మీరు చేసిన ప్రతిజ్ఞ మరిచారా? అని మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది,

నా లాంటి భావి భారత పౌరుల భవిష్యత్తు గురించి ఆలోచించని మిమ్మల్ని చూసి మా అమ్మ భయపడుతుంది- బాధపడుతుంది,

మా అమ్మ భయపడకుండా – బాధపడుకుండా చూసుకుంటానంటేనే ఈ ఊయల నుండి దిగుతా,
లేదంటే
ఈ ఊయలలో ఇలాగే కళ్ళు మూస్తా........

మా అమ్మ (భరతమాత) కోసం కాకపోయినా బుడిబుడి అడుగులే వేయని నా కోసం మారతారని కోరుకుంటూ.......

భారతీయులకి ప్రేమతో, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ

మీ చిట్టి చెల్లి భారతి..................
జై హింద్.......

నాన్నకు ప్రేమతో.....ఏమి ఇవ్వగలం – మన ఎదుగుదల తప్ప...





నాన్నకు ప్రేమతో.....ఏమి ఇవ్వగలం – మన ఎదుగుదల తప్ప.
(సినిమా బాగుంది, ఈ విషయం గుర్తుపెట్టుకోండి , దీని గురించి తర్వాత మాట్లడదాం)

ఆయన బ్రతికున్నన్ని రోజులూ మనతో ఉండేది – నాన్న,
మనం బ్రతికున్నన్ని రోజులూ మనతో బ్రతికుండేది –నాన్న (అప్పటికి మనం నాన్నలం అయితాం కాబట్టి-అర్థం అవ్వకపోతే మళ్లీ చదువు )
మన జీవితాల్లో ఒక నిశబ్ధ విప్లవం -నాన్న,
జీవితంలో మనకు అన్నీ సమకూర్చినా అమ్మ అంత ఆదరణకు నోచుకోని పాత్ర -నాన్న,
ఎందుకంటే మన జీవితాల్లో భయం , భక్తి, గౌరవం ఉండే ఏకైక పాత్ర –నాన్న,
మనపైన ఎంత ప్రేమ ఉన్నా పైకి గంభీరంగా కనిపించే పిచ్చి ప్రేమకు నిదర్శనం –నాన్న,
మనం, నాన్న అయ్యాక కానీ ఆయన బాధలు-బాధ్యతలు అర్థం కాకపోవచ్చు,
అర్థం అయ్యే నాటికి ఆయన మనకు ఉండొచ్చు- ఉండకపోవచ్చు.
ఒక వేల ఆయన ఉంటే బాగుంటుంది,
నాన్నను ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటాం & ఆయన మనల్నిఎలా చూడాలనుకున్నారో అలా ఉండటానికి ప్రయత్నిస్తాం.
ఒక వేల మన నుండి దూరం అయ్యుంటే మాత్రం లోపట లోపట కుమిలి కుమిలి ఏడుస్తాం & నాన్న ఒక్కసారి తిరిగి రా నాన్నా...నీకు నచ్చినట్టు ఉంటా అని అనుకుంటాం....
మళ్లీ అదేమాట.......
నాన్నకు ప్రేమతో.....ఏమి ఇవ్వగలం – మన ఎదుగుదల తప్ప.

ఇక సినిమా అంటారా...
సుకుమార్ మార్క్ దర్శకత్వం టైటిల్స్ నుండీ కనపడుతుంది,
(సుకుమార్ తెలుగు చిత్రసీమకు దొరికిన ఒక ఆణిముత్యం, I Respect you Sir)
ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ దాకా కుతూహలంగా చూస్తాం,
అక్కడక్కడ సామాన్యుడికి అర్థం కాని చదువుల లాజిక్,
ఇక NTR నటన చాలా చాలా క్లాస్ గా ఉంది.

సినిమా మొత్తం దాదాపుగా ప్రతి సీన్ గుర్తింది & చెప్పగలను,
But

పూర్తిగా చెబితే మీరు సినిమా చూస్తున్నప్పుడు కుతూహలం కోల్పోతారు ,
So go n watch with your family, especially with your dad.
(Frankly Enjoyed every moment except few frames).
జై హింద్..

All out...



"All Out" లేకపోతె దోమలు మనల్ని ఎలా చులకనగా చూస్తాయో ,

మనలో కొంచం కోపం , కొంచం చెడు లేకపోతే కంత్రీ గాళ్లు మనల్ని చులకనగా చూస్తారు,

మంచి వాళ్లకు మంచిగా ఉండడం ఎంత ముఖ్యమో ,చెడ్డ వాళ్ళతో చెడ్డగా ఉండడం కూడా అంతే ముఖ్యం ...జై హింద్

నేను తోపు - నేనే తోపు........




నేను తోపు - నేనే తోపు 
నేను తోపు అనుకునేవాడికి ఆత్మావిశ్వాసం ఉంటుంది,
నేనే తోపు అనుకునేవాడికి ఆత్మవిశ్వాసం తో పాటు అహంకారమూ ఉంటుంది,
నేను తోపు అనుకునేవాడు తనను తానూ గౌరవించుకుంటూ ఇతరులనూ గౌరవిస్తాడు,
నేనే తోపు అనుకునేవాడు తనను మాత్రమే గౌరవించుకుంటూ ఇతరులను కించ పరుస్తుంటాడు ,
నేను తోపు అనుకునేవాడికి విజయం పక్కాగా దక్కుతుంది,
నేనే తోపు అనుకునేవాడికి విజయం దక్కినా దక్కకపోయినా మనుషుల మనసులు మాత్రం దక్కకపోవచ్చు,
మొదటి రకం వాడు ఫెయిల్ ఐతే చేయూతనిస్తారు,
రెండవరకం వాడు ఫెయిల్ ఐతే చేయూతనివ్వడం కూడా కష్టమే ...అది ప్రజా నైజం .......
నువ్వు మాత్రమె తోపు కాదు ...


అందుకే జాగ్రత్త సుమీ ...జై హింద్....

"దేవాలయాలపై బూతు బొమ్మలు"...




"దేవాలయాలపై బూతు బొమ్మలు"........ఎందుకంటే 
శ్రుంగారాన్ని దైవత్వం అంత పవిత్ర కార్యంగా చూడాలనేదే దాని ఉద్దేశం.......
ముద్దు బహిరంగంగా పెట్టుకొవాలో, వద్దో అనేది వారి వారి వ్యక్తిగతం....
కాని ఒకరి వ్యక్తిగత జీవితం ఇంకొకరి సామాజిక జీవితాన్ని ప్రభావితం చేస్తే మాత్రం అది ముమ్మాటికీ తప్పే.......
ఎవరి స్వేచ్చ వారిది, కాని ఒకరి స్వేచ్చ ఇంకొకరికి అసహ్యం కలిగించేదిలా, ఇంకొకరి స్వేచ్చకి ఇబ్బంది కలిగిస్తె మాత్రం అది ముమ్మాటికీ తప్పే........
చదువుతో పాటు మన విజ్ఞానం ఎదగాలి 
చదువుతో పాటు మన అలోచనా విధానం ఎదగాలి

కాని ఆ ఎదుగుదలతో పాటు మన మూలాల్ని గుర్తు పెట్టుకుంటె అది అందరికీ మంచిది.......


జై హింద్

భాష వేరు..... యాస వేరు.....





భాష వేరు.....
యాస వేరు.....
యాసనే భాషనుకోవడం అమాయకత్వమా....
అస్థిత్వం కోసం ఆరాటమా......
ఎవరి యాసలో వాళ్లు మాట్లాడడం వారికి ఆనందం....
బాధల్ని, భయాల్ని,ఆనందాల్ని చెప్పుకొనేది యాసలోనే....
భాషకి పుట్టిన బిడ్డలే ఈ యాసలు.....
అందరి బిడ్డల ఎదుగదలే ఆ తల్లికి కావాల్సింది.....
ఇక్కడ ఏ ఒక్క బిడ్డా ఎక్కువ కాదూ...ఏ ఒక్క బిడ్డా తక్కువ కాదు....
ఆ విషయం తెలియని కొందరు మూర్ఖులు తమ యాసే గొప్పనుకుంటుంటారు....
ఆ మూర్ఖులు మిగితా యాసల్ని చూసి పరిహాసమాడుతుంటారు...
అది వారి అహంకారమో.....

మానవ సంబంధాలు..........






మానవ సంబంధాలు తుంచుకోవడానికి/పెంచుకోవడానికీ ఉపయోగపడుతుందేమో చూడండి...
వ్యక్తులు నిన్ను గౌరవిస్తున్నారూ లేదా ప్రేమిస్తున్నారంటే......దానికి 3 కారణాలుంటాయి.....
1.
నువ్వు మంచి వ్యక్తివి అయ్యి ఉండడం.
2.
అవతలి వ్యక్తి మంచి వ్యక్తి అయ్యుండడం.
3.
ఆ వ్యక్తికి నీతో ఏదయినా పనుండడం.
ఇంకో విధంగా చెప్తే....
వ్యక్తులు నిన్ను గౌరవించట్లేదు/ప్రేమించట్లేదు అంటే....
1.
నువ్వు చెడ్డ వ్యక్తివి కావడం.
2.
అవతలి వ్యక్తి చెడ్డ వ్యక్తి అవ్వడం.
3.
అవతలి వ్యక్తికి నీతో ఏ పనీ లేకపోవడం.
మనుషుల మనసులను బట్టి మనమూ మారాలా?......లేకపోతే....
మన స్వభావానుసారం ఉండాలో నిర్ణయం మీదే.......


దేవుడు డబ్బులు ఏం చేసుకుంటాడండీ??

దేవుడు డబ్బులు ఏం చేసుకుంటాడండీ??
ప్రతి గురువారం వెళ్ళినట్టే ఈ గురువారం కూడా సాయి బాబా గుడికి ఇందాకే వెల్లివస్తున్న.....చాలా సందర్భాల్లో , దాదాపుగా అన్నీ మరిచిపోయి ఆ బాబాని చూస్తూ కూర్చుంటా ఎప్పుడూ.....కానీ ఈ రోజు ఒక చిన్న పాప నా దృష్టిని దేవుడి వైపునుండి తన వైపుకి తిప్పుకుంది.....సరే లే ...పిల్లలూ, దేవుడూ సమానమే అన్నారు పెద్దలు అని దేవుడ్ని చూడడం మానేసి ఆ పాపని చూస్తూ కూర్చున్నా....ఇక ఆ పాప తల్లిదండ్రులు తీర్థం తీసుకుందామని పూజారి దగ్గరకి వచ్చారు.....ఆ పాప కూడా వాళ్లని అనుసరించింది.....అప్పుడే వాళ్ల నాన్న తన జేబులో నుండి పది రూపాయల నోటు ఆ పాప చేతిలో పెట్టాడు.....ఆ ముద్దుల పాప తన చేతిలో ఉన్న డబ్బులని హుండీలో వెయ్యాలనుకుంది....అప్పుడు వాళ్ల నాన్న వారించి అలా వేయొద్దు పంతులు గారు చూస్తున్నప్పుడు వెయ్యాలన్నట్టు ఆ పాపకి సైగ చేసాడు....పాపం ఆ చిట్టి తల్లికి తెలీదు కదా, గుడిలో కూడా లౌక్యం పాటించాలని...పాపం తత్వం బోధపడక అలానే ఉండిపోయింది.....అయినా ఆ వేసే డబ్బులేవో గుడి బయట కూర్చున్న బిచ్చగాళ్ళకు, అనామకులకు వెయ్యొచ్చు కదా(అమ్మో!!దొంగ బిచ్చగాళ్ళను కూడా గుర్తిన్చాగలగాలండీ).....అలా పిల్లలకు దాన గుణం నేర్పించొచ్చు కదా.....అయినా దేవుడి కి డబ్బులెందుకండీ...ఆయన మనలా ఖర్చులు పెడతాడా ఏంటీ??......

జై హింద్...........

గెలుపు.....ఓటమి......





గెలిచిన వాడికి , ఓడిన వాడికి తేడా..... 
వాళ్ల ఆలోచన విధానమే......
గెలుస్తాననుకుంటే గెలుస్తావు.......
ఓడతాననుకుంటే ఓడతావు.......
గెలిచిన వాడికి బంధువులెక్కువ......
పొగడ్తలతో ముంచెత్తుతారు........
ఓడిన వాడికి రా(బందువు)లెక్కువ.....
విమర్శలతో ముంచెత్తుతారు.......
గెలిస్తే మావాడే అంటారు అందరు....
ఓడితే వీడెవడో మాకు తెలిదంటారు కొందరు.........
గెలుపుతో నీ వాళ్ళు కొందరు మారతారు.......
ఓటమితో ఇంకొందరు మారతారు........
గెలుపొచ్చినా......ఓటమోచ్చినా.....
నువ్వు మాత్రం అలానే ఉండు......
ఆఖరిగా..........
కష్టపడి ఓడిన వాడికే గెలవడం ఎలాగో తెలుస్తుంది..........

జై హింద్ 

రైతన్న ఆవేదన.......


గణేష్ మహారాజ్ కి......జై................


గురు దినోత్సవ శుభాకాంక్షలు....



నన్ను సృష్టించిన ఆ దేవుడి ప్రతిమ కనిపించినా , నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు తారసపడినా (నేననేది కనిపించిన ప్రతిసారీ),
దగ్గరికి రాని నా కరములు మిమ్మల్ని చూడగానే “నమస్కారం’ అంటూ తమ సంస్కారం చాటుకుంటాయి.
మిమ్మల్ని చూడగానే
“మా విద్యార్థి జీవితం మొత్తం గిర్రున కళ్ల ముందు అలా మెదలాడుతుంది,
మేము విద్యాలయాల్లో చేసిన చిలిపి పనులు గుర్తొస్తాయి,
మీరు చెప్పిన నీతి మాటలు అలా చెవుల్లో మార్మోగుతాయి,
మేము తప్పు చేసినప్పుడు, మేము ఏమైపోతామో అని బాధ్యతతో మీరు పెట్టిన ఛీవాట్లు గుర్తొస్తాయి,
మాపైన ఎంతో ప్రేమ ఉండీ, మా భవిత కోసం మమ్మల్ని దండించిన క్షణాలు గుర్తొస్తాయి,
పరీక్షల్లో తప్పితే మా వెన్ను తట్టిన క్షణాలు గుర్తొస్తాయి,
మంచి మార్కులు వచ్చినా కూడా ఎక్కువగా పొగడని మీ ముందుచూపు ఇప్పుడు గుర్తెరుగుతున్నాము,
కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మార్కులవే వస్తాయనే మీ మాటలు గుర్తొస్తాయి,
చదువుకన్నా సంస్కారం ముఖ్యమన్న మీ హెచ్చరికలు గుర్తొస్తాయి,
పుస్తకాలలోని పాఠాల కన్నా జీవితంలో ఉపయోగపడే పాఠాలు నేర్పిన మీ ప్రేమ గుర్తొస్తుంది,
మేము స్థిరపడ్డాము మాష్టారు, అని చెప్పగానే మీ కళ్లల్లో కనిపించే ఆ “గర్వం” నోబెల్ ముందు దిగదుడుపే అనిపిస్తుంది,
ఇంతా చేసి మీరు, మా నుండి ఆశించేది ఏదైనా ఉందా అంటే ......
అది మా “ఎదుగదలే”........
.
మీకు ఏమిచ్చినా ఋణం తీర్చుకోలేను .....
అందుకే,
మీరు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ మీకు ఇవే మా పాదాభివందనాలు.....

గమనిక: దేశ భవిషత్తు మీ చేతిలో ఉంది, దాన్ని కాపాడతారని ప్రతి గురువుని వేడుకుంటూ........గురువులందరికీ

“గురు పూజోత్సవ శుభాకాంక్షలు”

కలాం గారికి నివాళితో......స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.....

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు




ఝాన్సీ : హాయ్... నాన్నా.....

భరత్ : హెల్లో....... చిట్టితల్లి..... 

ఝాన్సీ : ఏం చేస్తున్నావు నాన్నా?.....

భరత్ : ఆఫీసులో కొంచం మిగిన పోయిన పని కొంచం ఉంది , ఆ పని చేసుకుంటున్నా.......ఏ?

ఝాన్సీ :నాన్నా.. నీ మొబైల్ ఫోన్ ఒకసారి ఇస్తావా?.....

భరత్ :ఇదిగో తీసుకో, ఏంటి గేమ్స్ ఆడుకుంటావా?

ఝాన్సీ : లేదు నాన్నా, నీ మెసేజెస్ చూస్తా....

భరత్ :మెసేజెస్ ఆ!!!!!.....ఎందుకు?

ఝాన్సీ : ఏమీ... లేదు, రేపు స్వాతంత్ర్య దినోత్సవం కదా, నీకు ఎన్ని స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు వచ్చాయో చూద్దాం అని...

భరత్ : గుడ్.....చూడు, నాకూ చెప్పు లెక్కపేట్టి ఎన్ని మెసేజెస్ వచ్చాయో? అయినా ఎందుకు అలా లెక్క పెట్టాలనిపించింది?

ఝాన్సీ : ఏం లేదు, నాన్నా న్యూ ఇయర్ కి అడ్వాన్సు గా ఎన్నో విషేస్ వస్తాయి, అలాగే చాలా పండగలకి ఎంతోమందికి విషెస్ పంపిస్తారు, కానీ మన జాతీయ పండగలకు అందరు ఎందుకు అలా పంపరు? దేశం అంటే మనలో ప్రేమ లేదా...?

భరత్ :అందరూ అలా ఉండకపోవచ్చు, భారతీయుల్లో చాలా మందికి మనదేశమన్నా, మన ప్రజలన్నా, చచ్చేంత ప్రేమ... కాదు... కాదు...చచ్చేంత పిచ్చి.....

ఝాన్సీ : మరి అలాగైతే విషెస్ ఎందుకు చెప్పుకోరు, నేననేది, అన్ని పండగలకీ , న్యూ ఇయర్ కీ , ఇచ్చినంత ఇంపార్టెన్స్ వీటికి ఎందుకు ఇవ్వట్లేదు?....నాన్నా??

భరత్ :హమ్మ! ఝాన్సీ ఎంత పెద్దగా ఆలోచిస్తున్నావు, నిన్ను చూసి గర్వంగా ఉంది నాకు, అలా అని ఏమి లేదు తల్లీ, భారతీయులందరు భారతీయులమని చెప్పుకోడానికి ఎప్పుడూ గర్వపడతారు, కాని విషెస్ విషయానికి వచ్చేసరికి?

ఝాన్సీ : అదే విషెస్ ఎందుకు చెప్పుకోరు ?
భరత్ : ఏదైనా ఒక వస్తువు మన దగ్గర ఉన్నంతకాలం దాని విలువ తెలియదు, విలువ తెలిసిన వాడు దాన్ని ఎప్పుడూ మర్చిపోడు, చులకన చేయడు కూడా...

ఝాన్సీ : అమ్మో! నాన్నా... కొంచం అర్థం అయ్యేలా చెప్పు....నాన్నా......

భరత్ :మన తాతయ్య స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు కదా! వారు ఎప్పుడూ చెప్పేవారు బ్రిటీష్ కాలం నాటి భయంకరమైన పరిస్థితులు, అప్పట్లో వాళ్ళకు స్వాతంత్ర్యం లేదు, దాన్ని ఎలాగైనా పొందాలని వాళ్ళు తహతహ లాడేవాళ్లు, తాపత్రయ పడే వాళ్లు, దేశం కోసం ప్రాణాలు సహితం అర్పించే వాళ్లు. అదే మరి ఇప్పుడో!!.......

ఝాన్సీ :మరి, ఇప్పుడు ఏమైంది నాన్నా!?

భరత్ : ఇప్పుడు మనకు స్వాతంత్ర్యం కావలసినంత ఉంది, అందుకే దాని విలువ చాలా మందికి తెలియటం లేదు.

ఝాన్సీ : ఏంటి నాన్నా? నీ ఒపీనియన్, విషెస్ చెప్పని వాళ్ళందరికీ స్వాతంత్ర్యం విలువ తెలియదనా?

భరత్ : అలా అని కాదు కానీ , దాదాపుగా దాని విలువ చాలామందికి తెలియదు, అందుకే అడ్వాన్సు విషెస్ కానీ విషెస్ కానీ చాలా తక్కువ మంది పంపిస్తారు.

ఝాన్సీ : ఏంటి నాన్నా! ఎప్పుడు పాజిటివ్ గా ఆలోచించమనే నువ్వు, నెగటివ్ గా మాట్లాడుతున్నావు అనిపిస్తుంది.

భరత్ :ఇది నెగటివ్ భావాలు కాదమ్మా, బాధతో వచ్చిన భావాలు. మన దేశం లో దేశ బక్తి కన్నా దైవ భక్తే ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది.

ఝాన్సీ : దేశ భక్తి? దైవ భక్తా? ఏంటి తేడా?.....కన్ఫ్యూజ్ చెయ్యకు నాన్నా.....వాటిలో ఏది గొప్ప?... ప్లీజ్ నాన్నా ఇంకొంచం అర్థం అయేలా చెప్పు..... నాన్నా.......

భరత్ :హిందువుల పండగలకి గుళ్లు, ముస్లింల పండగలకి మసీదులు, క్రిస్టియన్ల పండగలకి చర్చీలు, సిక్కుల పండగలకి గురుద్వారాలు, ఇంకా వేరే మతస్తుల మందిరాలు ఎప్పుడైనా గమనించావా?

ఝాన్సీ : హా... గమనించా.... కాని ఎందుకు?

భరత్ : ఆ పండగ దినాల్లో , ఆ ఆ దైవ మందిరాల్లో జనం ఎంత ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటూ, ఒకరిని ఒకరు పలకరించుకుంటూ, ఎంతో ఆనందంగా ఉంటారు. మరి జాతీయ పండగలకి అలా ఉండటం ఎప్పుడైనా....ఎక్కడైనా చూసావా?

ఝాన్సీ : హా..ఎందుకు చూడలేదు.... చూసా, మా స్కూల్లో వేరే స్కూల్లో చూసా, అంతే కాదు, స్కూల్ కి వెళ్తుంటే కొన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా చూసా.

భరత్ : హా.... ఝాన్సీ వాటిల్లో కూడా ఆ హడావిడి కొన్ని గంటల పాటే ఉంటుంది. కాని రోజంతా పండగ వాతావరణం ఉండదు.

ఝాన్సీ : అంటే దేశ భక్తి, దైవ భక్తి కంటే గొప్పది అంటావా?

భరత్ : ఇక్కడ ఏది గొప్ప అన్నది మ్యాట్టర్ కాదు. దేశ సేవ ప్రజలకు సేవ చేస్తే అది దైవ భక్తి తో సమానం, అందుకే పెద్దలు “మనవ సేవే మాధవ సేవ అన్నారు”. దేశం కోసం బ్రతకాలి, దేశం గర్వించేలా బ్రతకాలి.

ఝాన్సీ : అంటే ఎలా బ్రతకాలి నాన్నా?

భరత్ :ఎలా బ్రతకాలా........ మన అబ్దుల్ కలాం గారిలా బ్రతకాలి.

ఝాన్సీ : హా...... నాన్నా..... నాకు కూడా, కలాం తాత గారంటే అంటే చాలా ఇష్టం. ఈ మధ్యే చనిపోయారు కదా నాన్నా?

భరత్ : అవునమ్మా, ఒక గొప్ప వ్యక్తిత్వం గల గొప్ప వ్యక్తిని మన దేశం కోల్పోయింది.

ఝాన్సీ : అవును, నాన్నా, మీరు నాకు ఆయన మాటలు ఎప్పుడూ చెప్తుండేవారు.

భరత్ : కలాం గారు, ఎప్పుడూ, దేశాన్ని ప్రేమిస్తూ, దేశ ప్రజల్లో స్పూర్థిని నింపుతూ, తన జీవితాన్ని దేశ సేవ కే అంకితం చేసారు. ప్రతి వ్యక్తి కలాం గారిలాగా నిస్వార్ధంగా, నిజాయితీగా బ్రతకాలి.ఆయన చెప్పిన మాటలు కొన్ని గుర్తు చేసుకుందాం....
కలలు కనాలి, వాటిని సాకారం చేసుకోడానికి కష్టపడాలి.
నిన్ను నువ్వు బెస్ట్ అనుకోవాలి, సాధించలేనిది ఏదీ లేదు అనుకోవాలి.
ఎన్ని ఓటములు ఎదురైనా విజయం కోసం ప్రయత్నం మానుకోకూడదు.
జీవితం – కాలం, ఈ రెండూ మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి, వాటిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.
విద్యార్థి అంటే ప్రశ్నిస్తూ ఉండాలి, లేకపోతే నిజమైన విద్య నేర్చుకోలేవు.
దేశాన్ని మార్చే సత్తా ఉంది ముగ్గురికే -> తల్లి, తండ్రి, గురువు.
అందరూ వెళ్లే దారిలో కాకుండా , కొత్త దారిలో వెళ్లు, విజయాన్ని పొందే వరకు ఆగకు.
ఆత్మవిశ్వాసం- కఠోరశ్రమ ఉంటే విజయం నీ దాసోహం అంటుంది.
కష్టాలు లేకపోతే విజయాన్ని ఆస్వాదించలేవు , విజయం కోసం కష్టాన్ని కూడా అస్వాదించు.
ఇలా ఎన్నో స్పూర్థి నింపే మాటలు మనకందించి కలాం గారు వెళ్లి పోయారు.....
ఆయన కలలు కన్నా విషన్ 2020 సాకారం అవ్వాలంటే ప్రతి ఒక్కరూ దేశం గురించి ఆలోచించాలి...
దేశం గురించి ఆలోచించకపోయినా , పర్వాలేదు కాని, మీ వల్ల దేశం నాశనం అవ్వకుండా చూసుకుంటే ఆ పెద్దాయన ఆత్మ శాంతిస్తుంది.......
“కలాం గారు, మీకు భారత జాతి సలాం”....ఝాన్సీ..... స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తల్లీ...ఇప్పటికే లేట్ అయ్యింది....మనదేశం గురించి ఇంకా చాలా విషయాలు చేప్తా....ఇప్పుడు వెళ్లి పడుకో...... గుడ్ నైట్ రా.....

ఝాన్సీ :నీకు కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.......గుడ్ నైట్.....నాన్నా.....



జై హింద్.............

ఆటో డ్రైవర్ కూతురైతేనేమి!!

ఒక ఆటో డ్రైవరు కూతురు సివిల్స్ ని తన మొదటి ప్రయత్నంలోనె సాధించింది,
ఆటో డ్రైవర్ కూతురు సివిల్స్ సాధించకూడదు అని నా ఉద్దేశం కాదు....
సివిల్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన పరీక్షకి తన కూతురుని ముందుండి నడిపించిన ఆ తండ్రి ధైర్యం చాలా గొప్పదీ...
ఇక ఈ అమ్మాయి తపన , పట్టుదల ముందు సివిల్స్ లక్ష్యం మొదటి ప్రయత్నంలొనే తల వంచింది.....
ఈ అమ్మయికి తన తర్వాతి ప్రయత్నంలో ఇంకా మంచి ర్యాంక్ వస్తుందని ఆశిస్తున్నా......

ఆమె మాటల్లో :











(Her name is Pappu Priyanka and she is topper in UPSC 2014-2015 . The person who cleared the examination in her first attempt at the age of 23yrs with AIR 1003 IN the year 2014-2015.UPSC Hall ticket no. 688585. Date of birth is 28 Mar 1992. Her father is an auto driver and mother is house wife. And undoubtly the support of her sister Goutami Pappu is exceptional for all time. Last but not least she is my cousin sister.)

The success I’m enjoying now is not due to my own abilities alone but is also due to my family members and my friends support. I want to thank my guide and guru Dr.D.B.Kumar sir and also Dr.P.Nagaraju sir for their faith in me and for their continuous support.

My father is an auto driver but when I asked him about civil services he didn’t say that it is beyond his capacity but said that he will use his entire strength to achieve my dream and will be there with me and asked me to not to loose my willpower until I achieve success. His words were my strength and his attitude was my inspiration. He is my role model and this made me to reach my goal. Love you Nanna .

My mother is a housewife . She may not know what a civil servant will have to do as part of their job but she always said that we should have positive attitude and should see Ray of hope in every odd situation. She built such attitude in me which made me to withstand all difficulties that I faced in this path. Love u amma .

My sister made me to see my dreams with her eyes. She dreamt only for me. She gave her support to my father in all ways and together they didn’t let me notice the difficulties they are facing daily. Proud to have such a sister and I’m left with no words to talk about her. Love u darling .

Last but not the least my friends – Arun and Divya- they saw their success in mine. They gave their support in every aspect they can. They studied day and night for me. They cried when I’m sad and celebrated my happiness. Without You Peoplel I might not achieve this- love You guys .

"I thank all others who supported me in this path- Nazeer, Mohan, Prudhvi, Ramu , Raghu and everyone."

"Thank you so much…. Happy to share my success with all of You people."

జైహింద్ ........