ఒక ఊర్లో ప్రసాద్ అనే అబ్బాయి జనాలకి సేవ చేద్దాం అనే ఉద్దేశంతో కలెక్టర్ అవుదాం అనుకున్నాడు.....అందుకోసం రోజు తెగ చదివేస్తున్నాడు.....కొన్ని సంఘటనలు చూద్దాం..........
1. ఇంట్లో వాళ్ల అమ్మ పిలిచింది.....ఒరేయ్ ప్రసాదు, నాకు కొంచం నలతగా ఉంది రా...అలా బజారుకెళ్ళి తినడానికి ఏమైనా తీస్కుని రారా....పో అమ్మ, నువ్వే ఏదో ఒకటి చేస్కొని తిను....నేను నీకు సాయం చెయ్యలేను....బాగా చదువుకొని కలెక్టర్ అయ్యి జనాలకి సాయం చెయ్యాలి....
2. మామా ప్రసాద్...రమేష్ వాళ్ల నాన్నకి హెల్త్ బాగోలేదంట ICU లో ఉన్నాడంట...వెళ్లి వాణ్ని పలకరించి వస్తే వాడికి కొంచం ధైర్యంగా ఉంటది, వాళ్ల కుటుంబం కూడా , వాళ్లకి సహాయం చెయ్యడానికి మనలాంటి వాళ్లు కొందరు ఉన్నారని ఫీల్ అవుతారు.....అయ్యా!!..సారీ మామా రేపు వీకెండ్ టెస్ట్ ఉంది...నేను రాలేను కానీ, రమేష్ ని అడిగానని చెప్పు...అయినా.....నీకు తెలుసు కదరా..నేను బాగా చదువుకొని కలెక్టర్ అయ్యి జనాలకి సాయం చెయ్యాలి....
౩. హాయ్ ప్రసాద్, రా..రా...అలా వెళ్లి మన రూమ్ కింద ఉన్న చాయ్ బండోడి దగ్గర చాయ్ తాగి వద్దాం....సారీ, సురేష్, నేను రాలేను , నువ్వు చాయ్ అని చెప్పి అక్కడికెళ్ళాక, ఆ బండి వాడి జీవితం ఎలా ఉంది, పిల్లలు ఏం చదువుతున్నారు, ఇల్లెలా గడుస్తుంది అని బాతాకానీ పెడతావ్....అయినా మనకు అలాంటి అలగా జనంతో ఏంటి రా?...మనం బాగా చదువుకొని కలెక్టర్ అయ్యి జనాలకి సాయం చెయ్యాలి....
4. ఒరేయ్ ప్రసాద్...నువ్వు చాలా రోజుల నుండి సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నావ్ కదా....మన పనిమనిషి వాళ్ల అమ్మాయికి కూడా కలెక్టర్ అవ్వాలని ఉందంట...ఆమెకి అప్పుడప్పుడు నీ బుక్స్ ఇస్తే చదువుకొని ఇస్తారంట, అలాగే నిన్ను కొంచం టిప్స్ కూడా చెప్పమంది రా.....అయ్యో!!..ఏంటి అక్కా నువ్వు....నా బుక్స్ నేను ఎవరికీ ఇవ్వను, నేను ఆ అమ్మాయితో టైం వేస్ట్ చేసుకోలేను...అయినా అలా హెల్ప్ చేస్తుంటే నా టైం అంతా వేస్ట్ అయిపోతది......వాళ్ల అమ్మకి చెప్పు, నేను ఏ సహాయం చెయ్యలేను అని...అయినా....నీకు తెలుసుగా అక్కా.... నేను బాగా చదువుకొని కలెక్టర్ అయ్యి జనాలకి సాయం చెయ్యాలి....
5. ఓ బిడ్డా....నాకు కండ్లు కానొస్తలేవు....అస్సలు శాతన అయితలేదు.....జర, గా దవాఖానా దాక తీస్కపొయ్యి డాక్టర్ తో కలిపించి ఇలాజ్ ( treatment) ఇప్పియ్యి బిడ్డా....లేకపోతే నా పాణం పొయ్యేలా ఉంది....నీ సాయం ఈ జన్మల మరువ బిడ్డా.......అయ్యో!!!...అవ్వా......నేను క్లాసుకి వెళ్తున్నా..... కావాలంటే ఈవెనింగ్ వచ్చి తీస్కేల్తా అవ్వా... నీకు ఇప్పుడు సహాయం చెయ్యలేను...నేను బాగా చదువుకొని కలెక్టర్ అయ్యి జనాలకి సాయం చెయ్యాలి....
(అవ్వ మనసులో....పాపం...ఈ పోరడు ఎంత అమాయకుడు...ఇన్ని ఏండ్లు వచ్చినట్టున్నాయి....ఈ పోరనికి సాయం అంటే ఇంక అర్థమే తెలవలేదు....కలెక్టర్ అయితడంట...దేవుడు నిన్ను సల్లగా సూడాలి)
జై హింద్............

No comments:
Post a Comment