Wednesday, 9 May 2018

Maha Nati Review - మహానటి సావిత్రి

మహానటి సావిత్రి... దీన్ని సినిమా అనడం కంటే అందమైన మాయా జీవితమంటే బాగుంటుంది. సావిత్రి గారికే అర్థమయ్యీ, అర్థం కానట్టుగా కనపడే అందమైన మాయా జీవితం ఆమెది అంటే బాగుంటుంది.విధి ఆడిన వింత నాటకంలో పావుగా మారి కనుమరుగైన పాత్ర తనది అంటే ఇంకా ఇంకా బాగుంటుంది. సినిమా ఎలా ఉందీ అంటే మాత్రం అచ్చంగా జీవితంలాగే ఉందంటా.జీవితంలో ఉన్నట్టే ఈ సినిమాలో కూడా ప్రేమలు, ఆప్యాయతలు, బంధాలు, బంధుత్వాలు,కోపాలు, తాపాలు, వెక్కిరింపులు చీత్కారాలు, జయాపజయాలు‌, కింద పడడాలూ, లేవడాలు, బలాలు, బలహీనతల లాంటి అన్ని విషయాలూ సావిత్రి గారి జీవితంలో చూస్తాం. సావిత్రి గారి జీవితంలో ఏం జరిగిందని తెలుసుకోడానికి వెళ్లే ప్రతి ప్రేక్షకుడు, ఆమె జీవితపు మరుపురాని మధురమైన జీవిత పాఠాలతో బరువెక్కిన గుండెతో బయటికి వస్తాడు. సినిమాల్లోనే నటిస్తానయ్యా బయట అంతగా నటించడం రాదు అని సినిమాలో  ఒక చోట ఆమె చెప్పే డైలాగ్ ఆమె జీవితానికి అక్షరాలా సరిపోతుంది. సినిమాల్లో మహానటిగా పేరు తెచ్చుకున్న ఆమె, నిజ జీవితంలో నటులను గుర్తించలేకపోయింది.





" చరిత్ర నాస్తి కాదు నేస్తం అది అనుభవాల ఆస్తి " అన్నారు శ్రీశ్రీ. అలాంటి  వెలకట్టలేని ఆస్తులను అందించి,  తెలుగు సినీచరిత్రలో తనకంటూ ఒక గొప్ప స్థానం సంపాదించుకున్నారు ఆమె. హీరోల్లో ఎందరో స్టార్లను చూశాము, చూస్తున్నాము. కానీ, మీరు మాత్రం ఎప్పటికీ మా ఎవర్ గ్రీన్ స్టార్ సావిత్రి...కాదు, సావిత్రి గారు. కాదు, కాదు సావిత్రమ్మగారు..💐🙏😇😍💕


(Ee Cinema Ki Ratings Ivvlenu....Iste baagundadu ani bhaavistunnanu.....Abhimaana, Prematho chesina ee Mahaa Prayatnaanni andaroo  Abhinandindinchaalsinde.........Inkaa Raayaalani unna inthatitho aapi malli eppudaina raasta Mahaanati Gaaru)